Suhas: సుహాస్.. కొత్త సినిమా షురూ
ABN, Publish Date - Jun 16 , 2025 | 01:23 PM
అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్ జంట సుహాస్, శివాని నగరం జంటగా కోత్త సినిమా సోమవారం రామా నాయుడు స్టూడియోలో పూజ కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది.
అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్ జంట సుహాస్ (Suhas), శివాని నగరం (Shivani Nagaram) జంటగా కోత్త సినిమా సోమవారం రామా నాయుడు స్టూడియోలో పూజ కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి కల్కి డైరెక్టర్ నాగ్ అశ్వీన్ (Nag Ashwin), హీరో సత్యదేవ్ (Sathya Dev)నిర్మాత వంశీ నందిపాటి ముఖ్య అతిథిలుగా హజరయ్యారు. త్రిశూల్ విజినరి స్టూడియోస్ (Trishul Visionary Studios) నుంచి ప్రొడక్షన్ నం2 గా వస్తున్న ఈ చిత్రంతో గోపి అచ్చర (Gopi Atchara)దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. బి నరేంద్ర రెడ్డి నిర్మిస్తున్నాడు.
తాజాగా దర్శకుడు నాగ్ అశ్వీన్ (Nag Ashwin) ప్రధాన తారాగణంపై క్లాప్ కొట్టగా సత్యదేవ్ (Sathya Dev) కెమెరా స్విచ్చాన్ చేశారు. నిర్మాత వంశీ నందిపాటి మొదటి షాట్‌కు దర్శకత్వం వహించారు. ఈ నెల చివరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. గతంలో రైటర్ పద్మభూషణ్ చిత్రానికి రచన చేసిన షణ్ముక ప్రశాంత్ ఈ మూవీకి కథ అందించడం విశేషం. ఇంకా పూర్తి వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.