సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Goat Teaser: అమ్మాయిని లేపుకొచ్చి రచ్చ చేసిన సుడిగాలి సుధీర్

ABN, Publish Date - Dec 02 , 2025 | 04:35 PM

ఆగిపోయింది అనుకున్న సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer) గోట్ (Goat) సినిమా అన్ని అడ్డంకులను దాటుకొని రిలీజ్ కు సిద్దమవుతుంది.

Goat Teaser

Goat Teaser: ఆగిపోయింది అనుకున్న సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer) గోట్ (Goat) సినిమా అన్ని అడ్డంకులను దాటుకొని రిలీజ్ కు సిద్దమవుతుంది. బడ్జెట్ సమస్యల వలన దర్శకనిర్మాతలకు మధ్య వచ్చిన విభేదాల వలన గోట్ సినిమా ఆగిపోయింది. ఇక సగానికి పైగా షూటింగ్ ను డైరెక్టర్ నరేష్ కుప్పిలి ఫినిష్ చేయగా.. మిగిలిన షూటింగ్ ని నిర్మాత మొగళ్ల చంద్రశేఖర్ ఫినిష్ చేసి రిలీజ్ కు రెడీ చేశాడు. ఇక ఈ సినిమాతో కోలీవుడ్ బ్యూటీ, బ్యాచిలర్ సినిమా ఫేమ్ దివ్యభారతి (Divyabharathi) నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఇక తాజాగా గోట్ టీజర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఎవరు లేని అనాధ అయిన హీరో.. తనకు అందరూ గౌరవం ఇవ్వాలని సార్ ని పేరు పెట్టుకుంటాడు. ఇక సార్ చిన్న చిన్న దందాలు సెటిల్ మెంట్స్ చేసి జైలుకు వెళ్లి వస్తుంటాడు. ఇక ఆ సమయంలోనే అతడికి ఒక కాంట్రాక్ట్ వస్తుంది. ఒక డబ్బున్న అమ్మాయి తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని, తనను ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్లినవారికి రూ. 10 లక్షలు ఇస్తానని చెప్తుంది. ఇక సార్.. చాలా దైర్యం చేసి అమ్మాయి ఇంటి దగ్గడ నుంచే ఆమెను లేపుకొచ్చేస్తాడు. ఆ విషయం తెలుసుకున్న హీరోయిన్ అన్న.. ఎలాగైనా తన చెల్లిని లేపుకుపోయినవాడిని చంపాలని ప్రయత్నిస్తుంటాడు. ఇక సార్ ఇంటికి వచ్చాక ఆ అమ్మాయి లైఫ్ ఎలా మారింది. సార్ చివరికి అనుకున్నది సాధించాడా.. ? సార్ కి ఆ అమ్మాయికి మధ్య ప్రేమ ఎలా మొదలయ్యింది.. ? అనేది సినిమా కథ అని తెలుస్తోంది.

సినిమాలో సుధీర్ కామెడీ హైలైట్ అవ్వనుందని తెలుస్తోంది. ఇక దివ్యభారతి, సుధీర్ జంట చూడడానికి చక్కగా ఉన్నారు. అయితే టీజర్ కట్ చేసిన విధానం బావుంది కానీ, డబ్బింగ్ సరిగ్గా లేదు. మేకింగ్ వీడియోలో మాట్లాడినట్లు సుధీర్ డైలాగ్స్ ఉన్నాయి. లియోన్ జేమ్స్ మ్యూజిక్ బావుంది. మొత్తానికి టీజర్ ఒక మంచి పాజిటివిటీని క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్ బాగా చేస్తే సినిమా బావుండేలానే ఉందని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో సుధీర్ ఎలాంటి విజయాన్ని ఆందుకుంటాడో చూడాలి.

Updated Date - Dec 02 , 2025 | 04:51 PM