Jatadhara Release Trailer: బ్రహ్మ సృష్టిలో చీకటి కోణం.. ధన పిశాచి జననం
ABN, Publish Date - Nov 05 , 2025 | 06:30 PM
నవ దళపతి సుధీర్ బాబు( Sudheer Babu) హీరోగా నిలదొక్కుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు. ఇక ఈసారి హారర్ నేపథ్యంలో ఒక మంచి కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
Jatadhara Release Trailer: నవ దళపతి సుధీర్ బాబు( Sudheer Babu) హీరోగా నిలదొక్కుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు. ఇక ఈసారి హారర్ నేపథ్యంలో ఒక మంచి కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం జటాధర (Jatadhara. వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్నిఉమేష్ కుమార్ బన్సల్, శివిన్ నారంగ్, అరుణ అగర్వాల్, ప్రేరణ అరోరా, శిల్పా సింఘాల్, నిఖిల్ నందా నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షీ సిన్హా (Sonakshi Sinha) తెలుగుతెరకు పరిచయమవుతుంది.
ఇప్పటికే జటాధర నుంచి రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. నవంబర్ 7 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్.. తాజాగా రిలీజ్ ట్రైలర్ ను రిలీజ్ చేసి హైప్ పెంచేశారు. రిలీజ్ ట్రైలర్ కూడా ఆద్యంతం ఆకట్టుకుంటుంది.
ధన పిశాచిగా సోనాక్షీనే సినిమాకు హైలైట్ అని చెప్పాలి. దెయ్యాలను, దేవుడిని నమ్మని ఓ ఒక యువకుడు శివ.. దెయ్యాలను వెతుక్కుంటూ వెళ్తూ.. ధన పిశాచితో వైరం పెట్టుకుంటాడు. చిన్నతనం నుంచి అతనికి ఏదో సమస్య ఉందని, అది అంతా శివుడు చూసుకుంటాడని చెప్పడంతో.. ధన పిశాచిని ఎదుర్కొనే శక్తి శివకు మాత్రమే ఉందని చూపించారు. అసలు ఎవరీ ధన పిశాచి..? శివకు ఆమెకు ఉన్న వైరం ఏంటి.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ట్రైలర్ లో విజువల్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. మరి ఈ సినిమాతో సుధీర్ బాబు ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.