Kichcha Sudeep: మేమంతా మీవెంటే అంటున్న సుదీప్
ABN , Publish Date - May 10 , 2025 | 05:36 PM
ప్రముఖ కన్నడ స్టార్ హీరో సుదీప్ ప్రధాని నరేంద్ర మోదీకి కన్నడ చిత్రసీమ తరఫున ధన్యవాదాలు తెలిపారు. కన్నడ ప్రజలంతా మోదీ వెనకే ఉన్నారని చెప్పారు.
ప్రముఖ కన్నడ నటుడు కిచ్చా సుదీప్ (Sudeep) ప్రధాని నరేంద్రమోదీ (Narendra Modi) కి కితాబిచ్చారు. ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) సందర్భంగా ఇప్పటికే దేశ ప్రధాని మోదీపై, భారత సైన్యంపై ప్రశంసల జల్లు కురిపించిన సుదీప్ ఇప్పుడు మోదీకి ఓపెన్ లెటర్ రాసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఇటీవల తన తల్లి మరణం సందర్భంగా మోదీ సానుభూతి తెలియచేస్తూ లేఖ రాశానని, ఆ సమయంలో ఆయన మాటలు తనకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చాయని అన్నారు. ఇవాళ ఒక కృతజ్ఞుడైన కొడుకుగానే కాక, గర్వించదగ్గ భారతీయుడిగా కూడా ఈ లేఖ రాస్తున్నానని సుదీప్ తెలిపారు. మాటల మనిషి కాకుండా ప్రధాని మోదీ చేతల మనిషి అని, సరైన నాయకత్వానికి ఆయన ప్రతీక అని కిచ్చా సుదీప్ అన్నారు. ప్రతి కన్నడిగతో పాటు కన్నడ చిత్రసీమ మొత్తం మోదీ వెన్నంటి ఉంటుందని కిచ్చా సుదీప్ తెలిపాడు. ప్రధాని మోదీ ధైర్యం తామందరికీ స్ఫూర్తి అని అన్నారు. మోదీ నాయకత్వంలో రక్షణ దళాలు ప్రదర్శిస్తున్న శౌర్యం అమోఘమని కిచ్చా సుదీప్ చెప్పారు. లేఖ చివరలో జై హింద్, జై కర్ణాటక, జై భారత్ అంటూ సుదీప్ పేర్కొన్నారు.
Also Read: Ravi Basrur: మాస్ కా దాస్ ఆవిష్కరించిన వీర చంద్రహాస ట్రైలర్
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి