Samantha: నిర్మాతగా సామ్ హ్యాపీ... శుభం...
ABN , Publish Date - May 12 , 2025 | 05:45 PM
సమంత నిర్మించిన తొలి చిత్రం 'శుభం'కు మంచి స్పందన లభిస్తోంది. ఈ చిన్న చిత్రం తొలి వారాంతంలో రూ. 5. 25 కోట్లు వసూలు చేసిందని మేకర్స్ చెబుతున్నారు.
స్టార్ హీరోయిన్ సమంత (Samantha Ruth Prabhu) తొలిసారి నిర్మాతగా మారి ప్రొడ్యూస్ చేసిన సినిమా 'శుభం' (Subham). శుక్రవారం ఇది విడుదలైంది. దీనితో పాటే శ్రీవిష్ణు (Srivishnu) '#సింగిల్' (#Single) తో పాటు మరో ఆరేడు చిత్రాలు విడుదలయ్యాయి. అయితే ఈ మొత్తం చిత్రాలలో శ్రీవిష్ణు '#సింగిల్', సమంత 'శుభం' చిత్రాలు మాత్రమే బాక్సాఫీస్ బరిలో గట్టెక్కబోతున్నాయి. అల్లు అరవింద్ (Allu Aravind) సమర్పణలో నిర్మితమైన '#సింగిల్' మూవీ మూడు రోజుల్లో రూ. 16.30 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.
ట్రా లా లా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై సమంత నిర్మించిన తొలి చిత్రం 'శుభం'. హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, శ్రియ కొంతం, శ్రావణి లక్ష్మి, షాలిని కొండేపూడి, వంశీధర్ గౌడ్ తదితరులు నటించారు. సమంత అతిధి పాత్రలో మెరిసింది. విశేషం ఏమంటే 'శుభం' ప్రీమియర్స్ కు కూడా మంచి స్పందన లభించింది. అలానే మొదటి రోజు కంటే రెండో రోజు కలెక్షన్స్ బాగున్నాయని, రోజు రోజుకూ ఇవి పెరుగుతున్నాయని సమంత తెలిపారు. 'శుభం' మూవీ వీకెండ్ లో రూ. 5.25 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. అలానే ఇప్పటికే ఓవర్సీస్ లో 125కె డాలర్లను ఈ సినిమా వసూలు చేసిందట. మౌత్ టాక్ పాజిటివ్ గా ఉండటంతో రాబోయే రోజుల్లో మరింత చక్కని స్పందన తమ చిత్రానికి వస్తుందని సమంత ఆశాభావం వ్యక్తం చేస్తోంది. సమంత నిర్మాతగా మారుతున్నట్టు తెలియగానే చాలా మంది నిరుత్సాహపర్చారు. ఇవాళ చిన్న సినిమాలకు ఆదరణ లభించడం లేదని, లేనిపోని రిస్క్ ఎందుకని భయపెట్టారు. అయినా సమంత తన నిర్ణయాన్ని అమలు చేయడానికే సిద్థపడింది. ఆ రకంగా నిర్మాతగా సమంత ఖాతాలో తొలి విజయం పడిందనే చెప్పాలి.
Also Read: Pawan Kalyan -OG: ‘ఓజీ’ మళ్లీ మొదలైంది.. ఈసారి ముగిద్దాం
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి