Pawan Kalyan -OG: ‘ఓజీ’ మళ్లీ మొదలైంది.. ఈసారి ముగిద్దాం
ABN , Publish Date - May 12 , 2025 | 05:26 PM
పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న సినిమా ‘ఓజీ’ (OG). ఇప్పుడు అభిమానులకు శుభవార్త అందింది.
పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న సినిమా ‘ఓజీ’ (OG). ఈ సినిమా టైటిల్ టైటిల్ బయటకు వచ్చినప్పటి నుంచే, టీజర్ విడుదల చేసినప్పటి నుంచి ప్రేక్షకులు విపరీతమైన క్రేజ్ మొదలైంది. అయితే, పవన్ రాజకీయంగా బిజీగా ఉండడంతో చిత్రీకరణ వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు అభిమానులకు శుభవార్త అందింది. షూటింగ్ పునఃప్రారంభమైందంటూ టీం అప్డేట్ ఇచ్చింది.
‘‘మళ్లీ మొదలైంది.. ఈసారి ముగిద్దాం’’ అనే క్యాప్షన్‌తో త్వరలోనే చిత్రీకరణ పూర్తి చేయనున్నట్టు హింట్ ఇచ్చింది. షూటింగ్‌కు సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రియాంకా మోహన్ కథానాయికగా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ నెగటివ్ రోల్ చేస్తున్నారు.