సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Varanasi: అనుకున్న టైటిల్ నే దింపిన రాజమౌళి.. మహేష్ లుక్ అయితే బ్లాస్ట్ అంతే

ABN, Publish Date - Nov 15 , 2025 | 07:03 PM

అనుకున్నదే జరిగింది.. అభిమానుల ఆశ ఫలించింది. ఎట్టకేలకు SSMB29 టైటిల్ అధికారికం అయ్యింది. ఎప్పటినుంచో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వారణాసి (Varanasi) అనే టైటిల్ నే రాజమౌళి (Rajamouli)కన్ఫర్మ్ చేశాడు.

Varanasi

Varanasi: అనుకున్నదే జరిగింది.. అభిమానుల ఆశ ఫలించింది. ఎట్టకేలకు SSMB29 టైటిల్ అధికారికం అయ్యింది. ఎప్పటినుంచో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వారణాసి (Varanasi) అనే టైటిల్ నే రాజమౌళి (Rajamouli)కన్ఫర్మ్ చేశాడు. నేడు RFC లో జరుగుతున్న గ్లోబల్ ట్రాటర్ ఈవెంట్ లో మహేష్ బాబు (Mahesh Babu) లుక్ తో పాటు టైటిల్ గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేశారు. గ్లింప్స్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. విజువల్ వండర్ గా గ్లింప్స్ ను కట్ చేశారు. సినిమా కథ చెప్పకుండానే విజువల్స్ చూపిస్తూ కథను చెప్పుకొచ్చారు.

అయిదవ శతాబ్దం వారణాసిలో కథ మొదలై మళ్లీ భవిష్యత్ 2027 లోకి వచ్చి అక్కడినుంచి ఆఫ్రికా అసువులు, వనాంచల్ కి పోయి.. అక్కడ నుంచి త్రేతాయుగంలో ఆగి.. చివరకు మళ్లీ వారణాసిలోకి వచ్చినాట్లు చూపించాడు. ఇలా ఒకే గ్లింప్స్ లో ఎనిమిది లోకాలను చూపించాడు. ఇక చివర్లో రుద్రగా మహేష్ ను పరిచయం చేశాడు.చూచాయిగా కథ చెప్పాలంటే.. భూమి నుంచి భగభగ మండే ఒక అగ్ని శిఖ.. ఆకాశానికి చేయి అక్కడ నుంచి కిందపడితే భూమిపై వచ్చే పరిణామాలు.. దానిని ముందుగానే ఊహించి ఆ శక్తిని చేజిక్కించుకొని ప్రపంచాన్ని గుప్పిట్లో పెట్టుకోవాలనుకునే విలన్.. అతనిని ఆపడానికి కారణ జన్ముడిగా పుట్టిన రుద్రుడు.. వీరి మధ్య జరిగే యుద్ధమే వారణాసి అని తెలుస్తోంది.

ఇక రుద్రగా మహేష్ బాబు.. రక్తం నిండిన దేహంతో నందిపై.. ఒక చేత్తో త్రిశూలం పట్టుకొని.. ముక్కోపిగా వస్తుంటే.. సాక్ష్యాత్తూ శివుడే.. దిగివచ్చునట్లు కనిపిస్తుంది.మహేష్ లుక్ అయితే అస్సలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఎగురుతున్న జుట్టు.. ఉగ్ర రూపంలో మహేష్ ను చూసి ఫ్యాన్స్ ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఇక వారణాసి గురించిన కథ కావడంతో ఆ పేరే యాప్ట్ గా ఉంటుందని జక్కన్న దాన్నే ఫైనల్ చేసినట్లు సమాచారం. మహేష్ ను మునుపెన్నడూ ఈ విధమైన లుక్ లో చూసింది లేదు. మహేష్ విశ్వరూపం.. ఇదే నిదర్శనం అని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది.

Updated Date - Nov 15 , 2025 | 10:04 PM