SS Rajamouli: నా సిద్ధాంతాలకు .. నేను చేసే సినిమాలకు సంబంధం ఉండదు

ABN , Publish Date - Jun 15 , 2025 | 10:15 PM

కోలీవుడ్ స్టార్ ధనుష్(Dhanush), రశ్మిక మందన్నా(Rashmika Mandanna) జంటగా శేఖర్ కమ్ముల(Sekhar Kammula) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కుబేర(Kuberaa). 

Rajamouli

SS Rajamouli: కోలీవుడ్ స్టార్ ధనుష్(Dhanush), రశ్మిక మందన్నా(Rashmika Mandanna) జంటగా శేఖర్ కమ్ముల(Sekhar Kammula) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కుబేర(Kuberaa). అమిగోస్ క్రియేషన్స్ లోని సునీల్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. ఏకకాలంలో తమిళం, హిందీ, తెలుగు భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాలో అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి  రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. జూన్ 20 న కుబేర రిలీజ్ కానుంది.

 

 ఇక తాజాగా కుబేర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా దర్శక ధీరుడు  రాజమౌళి విచ్చేసి  కుబేర ట్రైలర్ ను రిలీజ్ చేశాడు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. " అందరికీ నమస్కారం. శేఖర్ కమ్ముల చాలా సాఫ్ట్ గా.. చాలా మర్యాదగా ఉంటారు. ఆయనను చూసిన వెంటనే మనకు అనిపించేది అది. కానీ, ఆయన చాలా చాలా మొండివాడు. అంటే.. తను నమ్మిన సిద్ధాంతాలకు ఏమి అడ్డు వచ్చినా.. ఎంత ఆశ చూపించినా ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఒక్క ఇంచు కూడా పక్కకి తగ్గరు.  ఆ క్వాలిటీ ఆయనలో నాకు బాగా నచ్చుతుంది. శేఖర్ నమ్మిన  సిద్ధాంతాల మీదనే సినిమా తీస్తాడు. నేను నమ్మిన సిద్ధాంతాలకు చేసే సినిమాలకు సంబంధం ఉండదు. మా ఇద్దరి దారులు వేరు అయినా.. శేఖర్ సినిమాలకు నేనెప్పుడూ అడ్మైర్ అవుతాను.

 

Dhanush: పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని ఉంది 


శేఖర్  ఇండస్ట్రీకి వచ్చి 25 సంవత్సరాలు అయ్యింది అంటే నాకే నమ్మబుద్ది కావడం లేదు. ఆయన నాకన్నా సీనియర్. 25 ఏళ్ళు అలానే ఉన్నాడు.. అలాంటి సినిమాలే తీసాడు.. ఇంకా ఇలాంటి సినిమాలు తీయాలనే కోరుకుంటున్నాం.  కుబేర సినిమా ప్రకటించిన వెంటనే నాగార్జున, శేఖర్ కమ్ముల  అని చూడగానే అద్భుతం అనుకున్నాను. ఇక ధనుష్ కూడా వచ్చాకా వావ్.. సూపర్ కాంబినేషన్ అనుకున్నాను. అల్ట్రా లియో రిచ్ ప్రపంచంలో నాగార్జున.. అల్ట్రా పూర్ ప్రపంచంలో ధనుష్.. కథ ఏమి చెప్పకుండా రిలీజ్ చేసిన ట్రాన్స్ ఆఫ్ కుబేర  చాలా ఆసక్తిని రేకెత్తించింది. 

 

 శేఖర్  సినిమాల్లో ఫ్యామిలీ డ్రామా కచ్చితంగా ఉంటుంది. శేఖర్ తన సినిమాల్లో కథను ముందే రివీల్ చేస్తాడు. కానీ ఈసారి కొద్దిగా కూడా రివీల్ చేయలేదు. సినిమా సస్పెన్స్ లా అయ్యిపోయింది. ట్రైలర్ ఆ సస్పెన్స్ ను ఇంకా పెంచింది. నికేత్ విజువల్స్ ను ఎంతో అద్భుతంగా చూపించాడు.  సినిమా మొత్తం రియల్లీ రియల్లీ టాప్ క్లాస్. నాది నాది.. ఈ లోకమంతా సాంగ్ దేవి శ్రీ ప్రసాద్ చాలా బాగా మ్యూజిక్ అందించాడు.  జూన్ 20 న ఈ సినిమాను అందరూ చూడాలని కోరుతున్నాను" అంటూ ముగించాడు. 

Updated Date - Jun 15 , 2025 | 10:15 PM