Dhanush: పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని ఉంది 

ABN , Publish Date - Jun 15 , 2025 | 09:19 PM

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush) డబ్బింగ్ సినిమాలతో తెలుగువారికి సుపరిచితమే. ఇక సార్(Sir) సినిమాతో తెలుగులో స్టైట్ ఫిల్మ్ చేసి  మరింత దగ్గరయ్యాడు.

Dhanush

Dhanush: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush) డబ్బింగ్ సినిమాలతో తెలుగువారికి సుపరిచితమే. ఇక సార్(Sir) సినిమాతో తెలుగులో స్టైట్ ఫిల్మ్ చేసి  మరింత దగ్గరయ్యాడు. సార్ సినిమాతో మంచి హిట్ అందుకున్న ధనుష్ ఇప్పుడు  కుబేర(Keberaa) సినిమాతో మరోసారి తెలుగువారిని పలరించబోతున్నాడు. శేఖర్ కమ్ముల(Sekhar Kammula) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అమిగోస్ క్రియేషన్స్ లోని సునీల్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు.  ఇక ఈ సినిమాలో ధనుష్ సరసన రశ్మిక(Rashmika)నటిస్తుండగా అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా భారీ అంచనాలను  రేకెత్తించింది.

 

 ఇక జూన్ 20 న  కుబేర రిలీజ్ కు రెడీ అవుతుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ తాజాగా కుబేర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు దర్శక ధీరుడు రాజమౌళి ముఖ్య అతిధిగా విచ్చేశాడు. ఇక ఈ వేడుకలో భాగంగా ధనుష్ తన మనసులోని మాటను బయటపెట్టాడు. ధనుష్ మల్టీ టాలెంట్ అన్న విషయం అందరికీ తెల్సిందే. హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్, సింగర్, మ్యూజిక్ కంపోజర్, డ్యాన్సర్.. ఇలా అన్నింటిలో కూడా ధనుష్ సిద్ధహస్తుడు. తమిళ్ లో మంచి మంచి సినిమాలకు దర్శకత్వం వహించి విజయాలను అందుకున్నాడు.

 

Kumari 21F: కుమారి 21 ఎఫ్ రీరిలీజ్ డేట్ వచ్చేసింది..


తెలుగులో ఒకవేళ డైరెక్ట్ చేయాల్సి వస్తే ఏ హీరోతో సినిమా చేయాలనుకుంటారు అన్న ప్రశ్నకు  ధనుష్ తడుముకోకుండా పవన్ కళ్యాణ్ పేరు చెప్పాడు. దీంతో వేదిక మొత్తం దద్దరిల్లింది.  మొదటి నుంచి కూడా ధనుష్ కు పవన్ కళ్యాణ్ అంటే ఎంతో అభిమానం.  తెలుగు హీరోల్లో తన ఫేవరేట్ హీరో కూడా పవన్  కళ్యాణ్ అని ఎన్నోసార్లు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.  ఇప్పుడు కాకపోయినా భవిష్యత్ లోనైనా ఈ కాంబో సెట్ కావాలని  పవన్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. 

Updated Date - Jun 15 , 2025 | 09:20 PM