Prabhas: జపాన్లో మిస్ అవుతున్న డార్లింగ్.. ఇద్దరం కలిసి మరోసారి చెక్కేద్దాం

ABN , Publish Date - Dec 06 , 2025 | 11:38 AM

ప్రభాస్‌ జపాన్ అభిమానులతో కలిసి 'బాహుబలి; ది ఎపిక్' ప్రమోషన్స్లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో రాజమౌళి ప్రభాస్‌కు లెటర్‌ రాశారు. దాన్ని ఆయన ప్రభాస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు

SS Rajamouli - Prabhas

ప్రభాస్‌, అనుష్క ప్రధాన పాత్రలో రాజమౌళి(SS Rajamouli) దర్శకత్వంలో వహించిన  ‘బాహుబలి’ రెండు భాగాలు కలిపి ‘బాహుబ‌లి: ది ఎపిక్‌’ పేరుతో ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ చిత్రం జపాన్‌ ప్రేక్షకుల ముందుకు వెళ్లనుంది. డిసెంబర్‌ 12న జపాన్‌లో ‘బాహుబ‌లి: ది ఎపిక్‌’ (Baahubali: The Epic) విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రభాస్‌ జపాన్  అభిమానులతో కలిసి ప్రమోషన్స్ లో  పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో రాజమౌళి ప్రభాస్‌కు లెటర్‌ రాశారు. దాన్ని ఆయన ప్రభాస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి 'డార్లింగ్ లవ్ యూ సో మచ్. జపాన్లో నిన్ను మిస్ అవుతున్నా. ఇద్దరం కళ్ళు మరోసారి ఇక్కడికి వద్దాం' అని ప్రభాస్ రాసుకొచ్చారు. 

జపాన్‌లోప్రభాస్‌కు (Prabhas) ఘన స్వాగతం లభించింది. జపనీస్‌ భాషలో బాహుబలి క్యారెక్టర్స్‌, బొమ్మలతో ఏర్పాటుచేసిన బోర్డులు చూసి వాటిపై ఆటోగ్రాఫ్ చేశారు. బాహుబలిలోని డైలాగులతో సందడి చేశారు. 

Letter.jpg


రాజమౌళి లెటర్ లో ఏం రాశారంటే.. ‘జపాన్‌లో అభిమానులకు నువ్వంటే ఎంత ఇష్టమో ఇప్పటికే నీకు అర్థమై ఉంటుంది. నీకు వారి అభిమానం చూసి ఆనందబాష్పాలు వస్తాయని నాకు తెలుసు. నేను జపాన్‌ నాలుగు సార్లు వెళ్లాను.  ప్రతిసారీ అందరూ నన్ను ఒక్కటే ప్రశ్న అడిగేవారు. ‘ప్రభాస్‌ ఎప్పుడు వస్తారు?’ అని!  వారి కోరిక నేడు నెరవేరింది. ఇన్ని రోజులకు నా బాహుబలి అక్కడ సందడి చేస్తున్నాడు. జపాన్లో ప్రేక్షకుల అభిమానాన్ని నాకన్నా ఎక్కువ ఆస్వాదిస్తున్నావని  ఆశిస్తున్నా.  జపాన్‌లోని మా అభిమానులందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నా. లవ్ యూ ’ అని రాజమౌళి లెటర్‌లో రాసుకొచ్చారు. ఈ లెటర్‌ నెట్టింట వైరల్ అవుతోంది.  

ALRO READ: Sasirekha Song Promo: 'మన శంకర వరప్రసాద్ గారు’ శశి రేఖ సాంగ్ ప్రోమో


Updated Date - Dec 06 , 2025 | 12:09 PM