Sasirekha Song Promo: 'మన శంకర వరప్రసాద్ గారు’ శశి రేఖ సాంగ్ ప్రోమో

ABN, Publish Date - Dec 06 , 2025 | 11:55 AM

'మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం నుంచి విడుదలైన  ‘మీసాల పిల్ల’ ఇప్పటికే టాప్ సాంగ్ గా నిలిచింది. ఇప్పుడు ‘శశిరేఖ’ అంటూ అలరించేందుకు సిద్ధమయ్యారు చిరంజీవి. ఆయన కథానాయకుడిగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మన శంకరవరప్రసాద్‌గారు’. పండగకి వస్తున్నారు... అన్నది ఉపశీర్షిక. నయనతార కథానాయిక. ఈ సినిమా నుంచి రెండో పాట ప్రోమోను తాజాగా విడుదల చేశారు. డిసెంబర్ 8న ఫుల్ సాంగ్  విడుదల కానుంది.  

Updated at - Dec 06 , 2025 | 11:55 AM