SS Rajamouli: వార్నర్ కి ‘బాహుబలి’ కిరీటం
ABN , Publish Date - Jul 30 , 2025 | 03:37 PM
ఓ టాలీవుడ్ మూవీ కోసం ఆస్ట్రేలియా క్రికెటర్ ప్రమోషన్ స్టార్ట్ చేశాడు. అడగకుండానే రంగంలోకి దిగిపోయాడు. ఆల్రెడీ ఓసారి మూవీకి కావాల్సినంత ఫేమ్ తీసుకొచ్చిన ఆ ఆటగాడు.. మళ్లీ క్రీజ్ లోకి దిగుతున్నాడు. అయితే అక్కడే ఊహించని ట్విస్ట్ ఎదురైంది.
ఆస్ట్రేలియా క్రికెట్ హీరో డేవిడ్ వార్నర్ (David Warner) కు తెలుగు ప్రజలతో ఉన్న అనుబంధం గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆడుతూ.. తన బ్యాట్‌తో గోల్డెన్ షాట్స్ కొడుతూ అభిమానులను మెప్పించిన వార్నర్, ఆఫ్ ది ఫీల్డ్ కూడా తెలుగు సినిమా పాటలు, డైలాగులతో సోషల్ మీడియాలో రచ్చ చేశాడు. అలాగే ఆ మధ్య 'రాబిన్ హుడ్' (Robin Hood) సినిమాలోనూ నటించి ఆకట్టుకున్నాడు. కరోనా సమయంలో అయితే మొత్తం తెలుగు సినిమా పాటలను, డైలాగ్స్ ను అనుకరిస్తూ రచ్చ రచ్చ చేశాడు. ఆ వీడియోస్ ఇంటర్నెట్‌ను షేక్ చేశాయి. అలా 'బాహుబలి' (Baahubali) సినిమాపై కూడా వీడియోలు చేసి ఆశ్చర్యపరిచాడు. అందుకే తెలుగు అభిమానులు వార్నర్‌ను ‘మనోడు’ అని గుండెల్లో పెట్టుకున్నారు. ఇప్పుడు, ఈ స్టార్ క్రికెటర్‌కు ఓ స్పెషల్ సర్‌ప్రైజ్ లభించబోతోంది.
దర్శక ధీరుడు ఎస్. ఎస్. రాజమౌళి (S.S. Rajamouli), వార్నర్‌కు ‘బాహుబలి’ కిరీటాన్ని బహుమతిగా పంపబోతున్నాడట! 'బాహుబలి' సినిమా విడుదలై పదేళ్లు గడిచిన సందర్భంగా, ఈ ఐకానిక్ చిత్రాన్ని ‘బాహుబలి: ది ఎపిక్’ పేరుతో ఒకే సినిమాగా విడుదల చేసేందుకు రాజమౌళి టీమ్ సిద్ధమవుతోంది. అక్టోబర్ 31 నుంచి ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో ఈ సినిమా మళ్లీ సందడి చేయనుంది. ఈ రీ-రిలీజ్ హడావిడిలో వార్నర్ తన పాత ‘బాహుబలి’ లుక్‌లో ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, కిరీటంతో బాగున్నానా లేక కిరీటం లేకుండా బాగున్నానా అని సరదాగా అడిగారు. దీనికి రాజమౌళి కూల్‌గా స్పందిస్తూ, 'డేవిడ్.. నిజంగా మాహిష్మతి రాజులా రెడీ అవ్వూ.. కిరీటం పంపిస్తున్నా' అని రిప్లై ఇచ్చాడు. దానికి వార్నర్ వెంటనే, 'వెయిటింగ్ బాస్!' అంటూ థంబ్స్-అప్ ఇచ్చాడు.
'బాహుబలి' టీమ్ కూడా, 'డేవిడ్, ఆస్ట్రేలియాలో సినిమా మళ్లీ చూడు!' అని కామెంట్ చేయగా, వార్నర్ 'పక్కా!' అని సమాధానమిచ్చాడు. ఈ సరదా చిట్‌చాట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వార్నర్ - రాజమౌళి బంధాన్ని, 'బాహుబలి' పట్ల అతని అభిమానాన్ని మరోసారి చాటింది. ఇదిలా ఉంటే... వార్నర్ ద్వారా 'బాహుబలి' ఎపిక్ కు కావాల్సినంత బజ్ వచ్చేస్తోంది. గ్లోబల్ వైడ్ గా ఈ సినిమా గురించి మళ్లీ చర్చ సాగేందుకు దారి తీసింది. ఈ విషయాన్ని పరిశీలస్తున్న నెటిజన్లు... సినిమా ప్రమోషన్స్ చేయడంలో రాజమౌళి తర్వాతే ఎవరైనా అని కామెంట్స్ పెడుతున్నారు. మరోసారి జక్కన్న మార్క్ ను చాటుకుంటున్నాడని ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. మరి రాజమౌళి నిజంగానే వార్నర్ కిరీటం పంపిస్తాడా.. లేక సరదాగా అన్నాడా అనేది చూడాలి.
Read Also: Thankyou Dear: బర్నింగ్ ఇష్యూ తో 'థ్యాంక్యూ డియర్'
Read Also: Anirudh Ravichander: ఆగస్టు 23న.. అనిరుధ్ ‘హుకుం’! టికెట్లకు భారీ డిమాండ్