SS Rajamouli: ఆ సీన్ చిరు చేయలేకపోయాడు.. అందుకే చరణ్ తో చేయించా
ABN , Publish Date - Aug 18 , 2025 | 04:01 PM
సాధారణంగా ఒక సీన్ ఐకానిక్ గా రావాలంటే ఏదో ఒక స్ఫూర్తి ఉండాలి. అందుకే డైరెక్టర్స్.. హాలీవుడ్ సినిమాలను చూస్తూ అందులోని సన్నివేశాలను స్ఫూర్తిగా తీసుకుంటూ ఉంటారు.
SS Rajamouli: సాధారణంగా ఒక సీన్ ఐకానిక్ గా రావాలంటే ఏదో ఒక స్ఫూర్తి ఉండాలి. అందుకే డైరెక్టర్స్.. హాలీవుడ్ సినిమాలను చూస్తూ అందులోని సన్నివేశాలను స్ఫూర్తిగా తీసుకుంటూ ఉంటారు. కానీ, రాజమౌళి (Rajamouli) మాత్రం ప్రేక్షకుల ఆలోచనల నుంచే స్ఫూర్తి పొందుతానని చెప్పుకొచ్చాడు. ఆయన కెరీర్ లో అన్ని సినిమాలు హిట్టే. ముఖ్యంగా చెప్పుకోవాల్సిన సినిమాల్లో మగధీర ఒకటి. రామ్ చరణ్ (Ram Charan) ను హీరోగా నిలబెట్టిన సినిమా మగధీర(Magadheera). ఈ సినిమా ఒక ట్రెండ్ సెట్టర్. ఇక ఈ సినిమాలో అన్ని ఐకానిక్ సీన్సే. అందులో ఒకటి భైరవ ఊబిలో కూరుకుపోతుంటే గుర్రం వచ్చి కాపాడుతుంది.
ఇక ఆ సీన్ సినిమా మొత్తానికి ఎమోషనల్ గా నిలిచింది. ఒక గుర్రం తన యజమానిని ఎలా కాపాడుకుంది అనేది ఎంతో అద్భుతంగా చూపించారు. నిజంగా ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఆ షాట్ కుఆశ్చర్యపోయారు అంటే అతిశయోక్తి కాదు. అలాంటి సీన్ ను రాజమౌళి చిత్రీకరించడానికి ఆయన చిరంజీవి నటించిన కొదమ సింహం చూసి స్ఫూర్తి పొందినట్లు ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. 'నేను మొదటినుంచి చిరంజీవి గారికి పెద్ద అబిమానిని. థియేటర్ లో నేను ఆయన నటించిన కొదమ సింహం చూసినప్పుడు అందులో ఒక సీన్ నన్ను తీవ్ర భావోద్వేగానికి గురి చేసింది. విలన్స్.. చిరును పీకల్లోతు మట్టిలో కప్పెట్టేసి వెళ్ళిపోతారు. అప్పుడు ఒక గుర్రం వచ్చి ఆయనను కాపాడుతుంది. ఆ సీన్ నన్ను బాగా తీవ్ర భావోద్వేగానికి గురిచేసింది.
సీన్ అయ్యాకా ఆ గుర్రానికి, హీరోకు అనుబంధం లేదనిపించింది. అది చూసి నేను నిరుత్సాహపడ్డాను. అదేంటీ ఆయన ప్రాణాలు కాపాడిన గుర్రానికి కనీసం ఒక థ్యాంక్స్ కూడా చెప్పలేదు. ప్రాణాలు కాపాడిన అది నా దృష్టిలో గుర్రం కాదు దేవుడు. దానికి ఆ కృతజ్ఞత చూపించాలని అనుకున్నాను. కొదమ సింహంలో అది చిరు చేయలేకపోయారు. అందుకే ఆ సీన్ ను మగధీరలో చరణ్ తో చేయించాను. ఊబిలో కూరుకుపోయిన చరణ్ ను గుర్రం పైకి తీసుకురాగానే ఆ కృతజ్ఞతతో, ఆ స్నేహంతో గుర్రాన్ని కౌగిలించుకొని థ్యాంక్స్ చెప్తాడు. అలా నా సినిమాల్లో వచ్చే బలమైన సన్నివేశాలు అన్ని ప్రేక్షకుల ఆలోచనల నుంచే స్ఫూర్తి పొందినట్లు ఆయన చెప్పుకొచ్చారు.
Raakh: ‘పాతాళ్‌లోక్’ దర్శకుడి నుంచి క్రైమ్ థ్రిల్లర్
Rao Bahadur Teaser: సత్యదేవ్ తో మహేష్ ఈసారి గట్టిగా కొట్టేలానే ఉన్నాడే