Rao Bahadur Teaser: సత్యదేవ్ తో మహేష్ ఈసారి గట్టిగా కొట్టేలానే ఉన్నాడే
ABN , Publish Date - Aug 18 , 2025 | 02:20 PM
అనుమానం ఒక పెను భూతం అని వినే ఉంటాం. మనిషికి ఎలాంటి జబ్బు వచ్చినా నయం చేయగలరేమో కానీ, అనుమానం అనే జబ్బు మాత్రం రాకూడదు.
Rao Bahadur Teaser: అనుమానం ఒక పెను భూతం అని వినే ఉంటాం. మనిషికి ఎలాంటి జబ్బు వచ్చినా నయం చేయగలరేమో కానీ, అనుమానం అనే జబ్బు మాత్రం రాకూడదు. అది కనుక వచ్చింది అంటే వారి చేతులతో వారి జీవితాలనే నాశనం చేసుకుంటారు. అదే అనుమానంతో రావు బహుదూర్ కూడా తన జీవితాన్ని ఎలా నాశనం చేసుకున్నాడో వెంకటేష్ మహా (Venkatesh Maha) రావు బహుదూర్ (Rao Bahadur) సినిమాలో కళ్ళకు కట్టినట్లు చూపించబోతున్నాడు. కేరాఫ్ కంచరపాలెం సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ గా మారారు వెంకటేష్. ఆ సినిమా ఇచ్చిన విజయాన్ని వెంకటేష్ సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాడు. వివాదాలతో కొంతవరకు నెగిటివిటీ తెచ్చుకున్న వెంకటేష్ చాలా గ్యాప్ తరువాత ఒక మంచి కథను ఎంచుకున్నాడు. అదే రావు బహదూర్.
చిన్న చిన్న పాత్రలతో కెరీర్ ను ప్రారరభించి హీరోగా మారాడు సత్యదేవ్. హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకోగలుగుతున్నాడు కానీ, విజయాలను దక్కించుకోలేకపోతున్నాడు. ఈ ఏడాది రిలీజ్ అయిన కింగ్డమ్ లో విజయ్ దేవరకొండ కన్నా సత్యదేవ్ నటనకే ఎక్కువ మార్కులు పడ్డాయి అంటే అతిశయోక్తి కాదు. టాలెంట్ ఉన్నా కూడా ఈ కుర్ర హీరోకు ఒక మంచి కథ పడడం లేదు అని అనుకుంటున్న సమయంలో సూపర్ స్టార్ మహేష్ బాబు.. సత్యదేవ్ టాలెంట్ ను గుర్తించి సూపర్ కథతో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు. సత్యదేవ్ ప్రధాన పాత్రలో వెంకటేష్ మహా దర్శకత్వం వహిస్తున్న చిత్రం రావు బహదూర్. మహేష్ బాబు మరియు నమ్రత నిర్మిస్తున్న ఈ సినిమాలో దీప థామస్ హీరోయిన్ గా నటిస్తోంది.
సైకలాజికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్ కు మించి అంటూ రిలీజ్ చేసిన ఈ టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. మొట్ట మొదటిసారి సత్యదేవ్ టాలెంట్ కు పర్ఫెక్ట్ సినిమా అని టీజర్ చూసాక నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. ఇక టీజర్ విషయానికొస్తే.. ఇది ఈ జనరేషన్ లో జరిగిన కథ కాదు. ఎప్పుడో తాతల నాటి కాలంలో ఒక రాజుగారు .. తన వూరులో ఉన్న బంగ్లాకు వస్తాడు. అక్కడ అతనికి ఒక అమ్మాయి నచ్చుతుంది. ఆ బంగ్లాలో వారి ప్రేమ ఎంతో బాగా కొనసాగుతుంది. అయితే ఉన్నాకొద్దీ రాజుగారిలో ఆమె పై అనుమానం.. పెనుభూతంగా మారి అతడిని రాక్షసుడిగా మారుస్తుంది. చివరికి ఆ ప్రేమించిన అమ్మాయిని రాజుగారు ఏం చేశారు.. ? అనుమానంతో అతడి జీవితం ఎన్ని మలుపులు తిరిగింది.. ? రావు బహదూర్ చివరకు ఏమయ్యాడు.. ? అనేది కథగా తెలుస్తోంది.
టీజర్ మొత్తం సత్యదేవ్ వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. మొదటి నుంచి చివరి వరకు గెటప్ ల మీద గెటప్ లు మారుస్తూనే ఉన్నాడు. కమల్ హాసన్ కనుక దశావతారం లో ఎలాంటి గెటప్ లు వేశాడో.. సత్యదేవ్ కూడా ఈ సినిమాలో అన్ని గెటప్స్ లో కనిపించాడు. ఇక ఈ లుక్స్ లో సత్యదేవ్ ను చూసిన అభిమానులు టాలీవుడ్ కమల్ హాసన్ అని కామెంట్స్ చేస్తున్నారు. స్టోరీ, సత్యదేవ్ లుక్స్ చూస్తుంటే మహేష్ ఈసారి గట్టిగా హిట్ కొట్టేలానే ఉన్నాడని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతోంది. మరి ఈ సినిమాతోనైనా సత్యదేవ్ మంచి హిట్ ను అందుకుంటాడేమో చూడాలి.
Janhvi kapoor: దేశాన్ని పొగడడానికి ప్రత్యేకంగా ఒక రోజంటూ ఉండదు
Rahul Sipligunj: హరిణ్యా రెడ్డితో.. రాహుల్ సిప్లిగంజ్ నిశ్చితార్థం! షాక్‌లో ఫ్యాన్స్