సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Baahubali Re Release: నాటి అభిమాని కోరిక‌.. నేడు నిజ‌మైంది! బాహుబ‌లి ఎపిక్ రిలీజ్‌

ABN, Publish Date - Oct 19 , 2025 | 07:57 PM

దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి రూపొందించిన బాహుబలి సినిమా ఎంతటి సంచలన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

baahubali re release

ద‌శాబ్ధం క్రితం దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి (SS Rajamouli) రూపొందించిన బాహుబలి (Baahubali) సినిమా దేశ‌వ్యాప్తంగా ఎంతటి సంచలన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మ‌రో ప‌ది రోజుల్లో ఆ బాహుబలి మాజిక్ మళ్లీ థియేటర్లలోకి రాబోతుంద‌న్న విష‌యం తెలిసిందే.

అయితే.. తాజాగా బాహుబ‌లిని ఉద్దేశించి ఓ ట్వీటు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. ఎనిమిదేళ్ల క్రితం ఓ సినీ అభిమాని బాహుబలి పార్ట్ 1, 2 పార్టుల‌ను కలిపి ఎడిట్ చేసి ఒకే సినిమా రూపంలో రిలీజ్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఈ జనరేషన్‌కి మళ్లీ థియేటర్లో బాహుబలి అనుభవం వస్తుందంటూ ద‌ర్శ‌కుడు రాజమౌళిని ట్విట్ట‌ర్‌లో అభ్య‌ర్థించాడు.

క‌ట్ చేస్తే ఇన్ని సంవ‌త్స‌రాల త‌ర్వాత‌ ఈ సినిమా రెండు భాగాలు బాహుబలి: ది బిగినింగ్ మరియు బాహుబలి 2: ది కంక్లూజన్ సినిమాలను క‌లిపి ఒక చిత్రంగా మ‌లిచి ఆక్టోబ‌ర్ 30న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని మ‌రో ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ దేవ కట్ట (Deva Katta) స్పందించారు. త‌థాస్తు! 🙏 2017లో చేసిన ఫ్యాన్ విష్‌ ఇప్పుడు నిజమవుతోంది. అక్టోబర్ 31న ప్రేక్షకులు మళ్లీ ఆ అనుభూతిని థియేటర్‌లో ఆస్వాదించబోతున్నారని తెలుపుతూ 2017లో ఒక అభిమాని చేసిన ట్వీట్‌ను షేర్ చేశాడు. ఇప్పుడు ఈ అంశం సామాజిక మాధ్య‌మాల్లో బాగా వైర‌ల్ అవుతుంది.

Updated Date - Oct 19 , 2025 | 07:57 PM