Srinu Vaitla: రూ. 2 వేల కోట్ల ఆస్తి.. శ్రీను వైట్ల ఏమన్నాడంటే.. ?
ABN, Publish Date - Jun 07 , 2025 | 08:07 PM
డైరెక్టర్ శ్రీను వైట్ల(Srinu Vaitla )గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Srinu Vaitla: డైరెక్టర్ శ్రీను వైట్ల(Srinu Vaitla )గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నీ కోసం(Nee kosam) సినిమాతో కెరీర్ ను ప్రారంభించిన శ్రీను వైట్ల.. ఆనందం సినిమాతో మొదటి హిట్ ను అందుకున్నాడు. ఈ సినిమా తరువాత శ్రీను వైట్ల వెనుతిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి రాలేదు. సొంతం, వెంకీ, ఢీ, రెడీ.. ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో మంచి సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించాడు.
అయితే ఇదంతా ఆగడు(Aagadu) సినిమా ముందు మాట. ఈ ఒక్క సినిమా ఆయన జీవితాన్ని తారుమారుచేసింది. ఆగడు సినిమా భారీ పరాజయాన్ని అందుకుంది. దీని తరువాత వచ్చిన ఏ సినిమా ఆయనకు విజయాన్ని అందించలేకపోయింది. ఇక ఆ తరువాత కొన్నేళ్లు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన శ్రీను వైట్ల గతేడాది విశ్వం సినిమాతో రీఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా ఒక మోస్తరు విజయాన్ని అందుకుంది. త్వరలోనే ఆయన మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో ఒక సినిమా చేయబోతున్నాడు.
తాజాగా శ్రీనువైట్ల ఒక ఇంటర్వ్యూలో తన మనోగతాన్ని బయటపెట్టాడు. టాలీవుడ్ లోనే రిచ్చెస్ట్ డైరెక్టర్ అని, ఆయనకు రూ. 2 వేల కోట్ల ఆస్తి ఉందని ఇండస్ట్రీలో వార్తలు వినిపించాయి. ఇక ఆ వార్తలపై శ్రీను వైట్ల స్పందించాడు. " రిచ్చెస్ట్ డైరెక్టర్ అయితే హ్యాపీ. మిగతావాళ్లు ఎంత రిచ్ నో నాకు తెలియదు. 2 వేల కోట్లకు అధిపతి అన్న మాట అవాస్తవం. నాకు అంత సీన్ లేదు. కాకపోతే నేనెప్పుడూ చెప్పేది ఒకటే. నేనెప్పుడూ డబ్బు కన్నా ఎక్కువ సినిమాకే ఇంపార్టెన్స్ ఇచ్చాను. అలా నిజాయితీగా కష్టపడడం వలనో.. ఏమో నేను ఇన్వెస్ట్ చేసిన ప్రతిచోటా నాకు లాభాలు వచ్చాయి. సినిమా కంటే రియల్ ఎస్టేట్ బాగా ఉపయోగపడిందా అంటే.. అసలు నేను రియల్ ఎస్టేట్ చేయలేదు. నాకు ఎలాంటి చెడు అలవాట్లు లేవు. దుబారా ఖర్చులు పెట్టను. వేరేవాళ్లకు నాలెడ్జ్ ఉంటుంది. స్థలాల మీద తప్ప నాకు వేరే నాలెడ్జ్ లేదు. అందుకే వాటిమీదనే ఇన్వెస్ట్ చేశాను. పొలాలు కొన్నాను. ఇప్పుడు నా ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉన్నారు అంటే కారణం అదే" అని చెప్పుకొచ్చాడు.