సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Srikanth Iyengar: మహాత్ముడిపై అనుచిత వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన న‌టుడు

ABN, Publish Date - Oct 13 , 2025 | 05:22 AM

మహాత్మా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నటుడు శ్రీకాంత్‌ అయ్యంగార్ ఆదివారం సోషల్‌మీడియా వేదికగా క్షమాపణలు తెలిపారు.

Srikanth Iyengar,

మహాత్మా గాంధీ (Mahatma Gandhi)పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నటుడు శ్రీకాంత్‌ అయ్యంగార్ (Srikanth Iyengar).. ఆదివారం సోషల్‌మీడియా వేదికగా క్షమాపణలు తెలిపారు. ఇటీవల నేను చేసిన కొన్ని వ్యాఖ్యలు మీ మనోభావాలను దెబ్బతీశాయి. అది నా ఉద్దేశం కాదు. మిమ్మల్ని బాధపెట్టినందుకు క్షమాపణలు. అలాగే, మన దేశానికి స్వాతంత్య్రం అందించడం కోసం పాటుపడిన మహావీరులందరికి మనస్ఫూర్తిగా క్షమాపణలు తెలియజేస్తున్నాను. జై హింద్‌’ అని పేర్కొన్నారు.

శ్రీకాంత్‌పై ‘మా’లో ఫిర్యాదు

మహాత్మా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు శ్రీకాంత్‌ అయ్యంగార్‌పై కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ ఇటీవలె సైబర్‌ సెల్‌ పోలీసులకు ఫిర్యాదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరిన సంగతి తెలిసిందే.

ఆదివారం ఆయన మా (మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌) అధ్యక్షుడు మంచు విష్ణుకు శ్రీకాంత్‌పై ఫిర్యాదు చేశారు. ‘భావ ప్రకటన స్వేచ్ఛ అనేది అందరికీ ఈ కాలంలో ఓ ప్యాషన్‌గా మారిపోయింది. ‘మా’ క్రమశిక్షణ కమిటీలో చర్చించి చర్యలు తీసుకుంటాం’ అని ‘మా’ జనరల్‌ సెక్రటరీ శివబాలాజీ అన్నారు.

Updated Date - Oct 13 , 2025 | 06:16 AM