Sreeleela: చిన్నారి శ్రీలీలకు ఘనంగా ఆహ్వానం పలికిన ఉస్తాద్ టీమ్
ABN , Publish Date - Jun 12 , 2025 | 03:01 PM
ప్రస్తుతం శ్రీలీల.. ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat Singh) సినిమాలో నటిస్తోంది.
Sreeleela: పెళ్లి సందD(Pelli SandaD) సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన భామ శ్రీలీల(Sreeleela). మొదటి సినిమా విజయం అందుకోలేకపోయిన.. శ్రీలీలకు మంచి అవకాశాలను అందుకునేలా చేసింది. మొదటి సినిమా ఇంకా రిలీజ్ కాకుముందే అమ్మడి చేతిలో వరుస అవకాశాలు వెల్లువలా వచ్చి పడ్డాయి. ధమాకా హిట్ తరువాత ఆమెను ఆపడం ఎవరి వలన కాలేదు. అయితే ధమాకా(Dhamakha) తరువాత శ్రీలీల చేసిన సినిమాలన్నీ పరాజయాలను చవిచూస్తూనే వచ్చాయి. అయినా కూడా శ్రీలీల తడబడకుండా సినిమాలు చేస్తూనే వస్తుంది.
ప్రస్తుతం శ్రీలీల.. ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat Singh) సినిమాలో నటిస్తోంది. పవన్ కళ్యాణ్(Pawan Kalyan) - హరీష్ శంకర్(Harish Shankar) కాంబోలో గబ్బర్ సింగ్)Gabbar Singh) తరువాత వస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. ఎన్నో ఏళ్లుగా ఈ సినిమా కోసం హరీష్ శంకర్ ఎదురుచూస్తున్నాడు. పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండడంతో ఈ సినిమా మధ్యలోనే ఆగిపోతుంది అని అనుకున్నారు. కానీ, చివరకు ఉస్తాద్ నిన్ననే కొత్త షెడ్యూల్ ను మొదలుపెట్టింది.
Mithra Mandali Teaser: బన్నీవాస్, ప్రియదర్శి మిత్రమండలి టీజర్ వచ్చేసింది
పవన్ కళ్యాణ్ సెట్ లో అడుగుపెడుతున్నట్లు ఒక వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియోలో శ్రీలీల కూడా కనిపించింది. ఈ షెడ్యూల్ లో వీరిద్దరి మధ్య జరిగే సన్నివేశాలను షూట్ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా నేడు.. శ్రీలీలను సెట్ లోకి ఆహ్వానిస్తూ మేకర్స్ ఒక ఫోటోను షేర్ చేశారు. సాధారణంగా ఎవరినైనా సెట్ లోకి ఆహ్వానిస్తే బొకేలు ఇస్తూ ఆహ్వానిస్తారు. లేదా సినిమాలో ని క్యారెక్టర్ లుక్, నేమ్ చెప్తూ ఆహ్వానిస్తారు. కానీ, హరీష్ శంకర్ టీమ్ మాత్రం శ్రీలీలను ఒక కొత్త పద్దతి లో సెట్ లోకి వెల్ కమ్ చెప్పారు. శ్రీలీల చిన్నప్పటి ఫోటోను షేర్ చేస్తూ ది క్యూటెస్ట్ వెల్ కమ్ ఆన్ ది సెట్స్ అంటూ రాసుకొచ్చాడు. ఆ ఫొటోలో చిన్నారి శ్రీలీల పిలక వేసుకొని ఎంతో ముద్దుగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ ఫోటోను ఊరికే సర్ప్రైజ్ కోసం తీసుకున్నారా.. ? లేకపోతే సినిమాలో ఈ ఫోటోకు సంబంధించి ఏదైనా సీన్ ఉందా అనేది తెలియాల్సి ఉంది.