Mithra Mandali Teaser: బన్నీవాస్, ప్రియదర్శి మిత్రమండలి టీజర్ వచ్చేసింది
ABN , Publish Date - Jun 12 , 2025 | 02:20 PM
ప్రియదర్శి, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా, విష్ణు కీలక పాత్రల్లో నటిస్తోన్న మిత్రమండలి చిత్ర టీజర్ గురువారం రిలీజ్ చేశారు.
అల్లు అర్జున్ స్నేహితుడిగా, గీతా ఆర్ట్స్2 వ్యవహారాలు చూసుకుంటున్న బన్నీ వాస్ (Bunnyvas) సడన్‌గా కొత్తగా బీవీ వర్క్స్ (BV Works) పేరిట కొత్త బ్యానర్ స్థాపించి సప్త అశ్వ క్రియేటివ్స్ (SaptaAswaCreatives) , వైరా ఎంటర్టైన్మెంట్స్ (Vyra Entertainments) సంస్థలతో కలిసి సంయిక్తగా రూపొందిస్తున్న సినిమా మిత్రమండలి (Mithra Mandali). ఇటీవలే ఈ చిత్రం టైటిల్, నటులను రివీల్ చేసిన మేకర్స్ గురువారం ప్రత్యేక ఈవెంట్ నిర్వహించి మిత్రమండలి (Mithra Mandali Teaser) టీజర్ విడుదల చేశారు.
ఈ సినిమాలో ప్రియదర్శి (Priyadarshi Pulikonda), రాగ్ మయూర్ (Rag Mayur), ప్రసాద్ బెహరా (Prasad Behra), విష్ణు (Vishnu) కీలక పాత్రల్లో నటిస్తుండగా ఇన్ ఫ్లూయెన్సర్ నిహారిక (Niharika Nm) టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది. తాజాగా రిలీజ్ చూస్తే ఫన్, మిస్టరీ జానర్‌లో మూవీని రూపొందించినట్లు అర్థమవుతోంది. ఈ చిత్రంతో విజయేందర్ ఎస్ (VijayendarS) దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా. విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్న ఈ సినిమాకి సోమరాజు పెన్మెత్స సహ నిర్మాత. ఆర్.ఆర్. ధృవన్ సంగీతం అందిస్తున్నాడు. శరవేగంగా ఈ సినిమా పూర్తి చేసి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.