సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Sreeleela: తప్పుకుందా... తప్పించారా...

ABN, Publish Date - Jun 25 , 2025 | 02:24 PM

ముందు అందంతో ఆకట్టుకుంది. ఆపై డాన్స్ తో అదరగొట్టింది. ఇప్పుడు నటనలో రాటుదేలుతోంది. కొత్త సినిమా వస్తోందంటే చాలు.. హీరోయిన్ రేసులో ముందుగా ఆ ముద్దుగుమ్మ పేరే వినిస్తోంది. కానీ అలాంటి బ్యూటీకి ఇప్పుడు పెద్ద షాక్ తగలడం చర్చనీయాంశంగా మారింది.

శ్రీలీల (Sreeleela) అంటేనే టాలీవుడ్ మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్. మహేశ్ బాబు (Mahesh Babu) తో 'గుంటూరు కారం' మూవీ చేసిన తర్వాత బ్యూటీ రేంజ్ మారిపోయింది. పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా మారిపోయింది. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా దూకుడు చూపిస్తోంది. ప్రెజెంట్ 'ఉస్తాద్ భగత్ సింగ్' (Ustaad Bhagat Singh) చేస్తున్న ధమకా పిల్ల చేతిలో రెండు హిందీ సినిమాలు, ఒక తమిళ్ మూవీ ఉన్నాయి. ఇక రవితేజతో చేస్తున్న 'మాస్ జాతర' (Mass Jathara) త్వరలో విడుదల కానున్న తరుణంలో బ్యూటీ గురించి ఓ షాకింగ్ న్యూస్ వైరల్ గా మారింది.


అక్కినేని కుర్రాడు అఖిల్ (Akhil Akkineni) నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'లెనిన్' (Lenin). పరువు హత్యల నేపథ్యంలో ఈ మూవీ వస్తోంది. ఆ మధ్య రిలీజైన గ్లింప్స్ లో అఖిల్కి జోడిగా శ్రీలీల కనిపించింది. అయితే ఇప్పుడు ఈ మూవీ నుంచి శ్రీలీల తప్పుకుందన్న వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. విజ్జిపాపకు బదులు మరో హీరోయిన్ కోసం మేకర్స్ సెర్చ్ చేస్తున్నారట. అయితే ఈ సినిమా నుంచి శ్రీలీల బయటకు రావడంపై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి.

వరుస సినిమాల వల్లే శ్రీలీల డేట్స్ సర్దుబాటు చేయడం లేదని... అందుకే 'లెనిన్' నుంచి బయటకు వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే శ్రీలీల కోసం పలుమార్లు షూటింగ్ ను వాయిదా వేసుకున్నారట మేకర్స్. అయితే శ్రీలీల మాత్రం మరికొంత సమయం కావాలని అడిగినట్లు ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. దీంతో ఆమె కోసం వెయిట్ చేయడం కంటే... మరో హీరోయిన్ ను తీసుకుంటే బెటర్ అని భావిస్తున్నారట మేకర్స్. ఇదిలా ఉండగానే.. ఈ సినిమా నుంచి తప్పుకోవడానికి శ్రీలీల తల్లి కూడా ఒక కారణమంటున్నారు గాసిప్ రాయుళ్లు.


మాములుగానే అమ్మకుట్టి అయిన శ్రీలీల... తల్లి చెప్పినట్లు చేస్తుందని నిర్మాతలు చెవులు కొరుక్కుంటున్నారట. తల్లి చెప్పడం వల్లే తెలుగు సినిమాలను కాదని... బాలీవుడ్ మూవీస్ కు డేట్స్ ఇస్తోందని చెప్పుకుంటున్నారు. కేవలం తల్లి చెప్పడం వల్లే శ్రీలీల డేట్స్ ఇవ్వడం లేదని... అందుకే 'లెనిన్'లో మరో హీరోయిన్ ను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. గతంలో లవర్ బాయ్ గా గుర్తింపు తెచ్చుకున్న తరుణ్ కూడా తల్లి చెప్పినట్లు చేసి కెరీర్ కు ఎండ్ కార్డ్ వేసుకున్నాడని... ఇప్పుడు శ్రీలీల కూడా అదే తప్పు చేస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. చూడాలి మరి... ఈ న్యూస్ పై శ్రీలీల ఎలా రియాక్ట్ అవుతుందో!

Read Also: SS Rajamouli: గేమింగ్ ప్రపంచంలోకి దర్శక ధీరుడు

Also Read: NTR Family: శ్రీకృష్ణ పాత్రతో రాజయోగం ఖాయం...

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Jun 25 , 2025 | 02:24 PM