Sree Vishnu: వెండితెరపై ప్రతి యువకుడి కథ...
ABN , Publish Date - Nov 05 , 2025 | 05:39 PM
ప్రముఖ నటుడు శ్రీవిష్ణు సితార ఎంటర్ టైన్ మెంట్స్ లో సినిమా చేయబోతున్నాడు. సుమంత్ హీరోగా నటించిన 'అనగనగా' మూవీ దర్శకుడు సన్నీ సంజయ్ ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాడు. ఈ చిత్రానికి శ్రీకర ప్రొడక్షన్స్ సంస్థ ప్రెజెంటర్ గా వ్యవహరించబోతోంది.
వైవిధ్య భరితమైన కథలను ఎంచుకుని సినిమాలుగా చేస్తున్నాడు శ్రీవిష్ణు (Sree Vishnu). అతనితో సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ఓ సినిమాను ప్లాన్ చేసింది. ఈ బ్యానర్ నుండి వస్తున్న ఈ 39వ సినిమాను 'అనగనగా' (Anaganaga) మూవీతో ఓటీటీలో అరంగేట్రమ్ చేసిన సన్నీ సంజయ్ (Sunny Sanjay) తెరకెక్కించబోతున్నాడు. ఇంకా పేరు నిర్ణయించని ఈ సినిమాకు 'ది స్టోరీ ఆఫ్ ఎవ్విరి యంగ్ స్టర్' అనే పేరు పెట్టారు.
ఈ సినిమాను ప్రకటిస్తూ సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ఓ పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఈ సినిమాకు సన్నీ సంజయ్ ఓ గొప్ప కథను తయారు చేశాడని, త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభిస్తామని నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ (Suryadevara Nagavamsi), సాయి సౌజన్య (Sai Soujanya) తెలిపారు. సున్నితమైన భావోద్వేగాలతో నిండిన ఈ కథ, రోజువారీ జీవితాన్ని నిర్వచించే నిశ్శబ్ద సంఘర్షణలు, ఆశలు, సంతృప్తిలను అన్వేషించేలా సాగుతుందని, తప్పని సరిగా ఈ కథతో మరోసారి ప్రేక్షకుల మనసు దోచుకుంటామని వారు అన్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
Also Read: Baahubali’s Eternal War: 2027లో యానిమేటెడ్ బాహుబలి
Also Read: Monalisa: కుంభమేళా పిల్ల మోనాలిసా టాలీవుడ్ ఎంట్రీ.. హీరో ఎవరంటే