Monalisa: కుంభమేళా పిల్ల మోనాలిసా టాలీవుడ్ ఎంట్రీ.. హీరో ఎవరంటే
ABN , Publish Date - Nov 05 , 2025 | 05:25 PM
సోషల్ మీడియా వచ్చాక ఎవరు ఎందుకు ఫేమస్ అవుతున్నారో అర్ధం కాకుండా పోతుంది. మహాకుంభమేళాలో దేవుడిని దర్శించుకొని రాకుండా కొంతమంది యూట్యూబర్స్ ఒక పూసలు అమ్మే అమ్మాయిని వీడియోలు తీసి సోషల్ మీడియా సెన్సేషన్ గా మార్చారు. ఆమె మోనాలిసా (Monalisa).
Monalisa: సోషల్ మీడియా వచ్చాక ఎవరు ఎందుకు ఫేమస్ అవుతున్నారో అర్ధం కాకుండా పోతుంది. మహాకుంభమేళాలో దేవుడిని దర్శించుకొని రాకుండా కొంతమంది యూట్యూబర్స్ ఒక పూసలు అమ్మే అమ్మాయిని వీడియోలు తీసి సోషల్ మీడియా సెన్సేషన్ గా మార్చారు. ఆమె మోనాలిసా (Monalisa). కలువరేకుల్లాంటి కళ్లు.. హీరోయిన్ ను మించిన అందం అంటూ మోనాలసాను ఆకాశానికి ఎత్తారు. ఇక ఆ వీడియోలు వైరల్ గా మారి మోనాలిసా సెలబ్రిటీగా మారడమే కాకుండా హీరోయిన్ గా కూడా ఛాన్స్ దక్కించుకుంది.
ఇప్పటికే బాలీవుడ్ డైరెక్టర్ ఆమెను హీరోయిన్ గా చేస్తానని మాట ఇచ్చి తప్పిన విషయం తెల్సిందే. ఆ సినిమా మొదలు కాకముందే ఆగిపోయింది. ఇక ఇప్పుడు మోనాలిసా టాలీవుడ్ కు ఎంట్రీ కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇటీవలే ఆమె నటిస్తున్న తొలి తెలుగు సినిమా పూజా కార్యక్రమాలతో మొదలయ్యింది. ఇట్స్ ఓకే గురు, క్రష్ లాంటి సినిమాలతో తెలుగుతెరకు పరిచయమైన హీరో సాయి చరణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం లైఫ్. శ్రీను కోటపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను శ్రీ వెంగమాంబ మూవీస్ బ్యానర్ పై అంజయ్య విరిగినేని, ఉష విరిగినేనిలు నిర్మిస్తున్నారు.
ఇక ఈ సినిమాలో సాయి చరణ్ సరసన మోనాలిసా హీరోయిన్ గా నటిస్తోంది. మంచి కథతో తెరకెక్కుతున్న చిత్రమని, పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కు సిద్ధమవుతుందని తెలుస్తోంది. ఈ సినిమా కొద్దిగా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా మోనాలిసాను తెలుగులో ఆపడం ఎవరితరం కాదు. మరి ఈ పూసలు అమ్ముకొనే పిల్ల తెలుగు హీరోయిన్ గా సెట్ అవుతుందా లేదా అనేది చూడాలి.
Baahubali’s Eternal War: 2027లో యానిమేటెడ్ బాహుబలి
Rahul Sadasivan: మోహన్ లాల్ కొడుకు హీరోగా 'డీయస్ ఈరే'