Srivishnu: కోన వెంకట్ సమర్పణలో శ్రీవిష్ణు సినిమా
ABN, Publish Date - Sep 23 , 2025 | 09:07 AM
శ్రీవిష్ణు కొత్త సినిమా టైటిల్ ప్రకటన అక్టోబర్ 2న వెలువడబోతోంది. ఈ సినిమాకు జానకిరామ్ మారెళ్ళ దర్శకుడు కాగా కోన వెంకట్ ఈ సినిమాకు ప్రెజెంటర్.
ఈ యేడాది #సింగిల్ (Single) సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న శ్రీవిష్ణు (Srivishnu) ... ఇప్పుడు మరో సినిమాతో త్వరలో జనం ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాకు కోన వెంకట్ (Kona Venkat) సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. స్కంద వాహన మోషన్ పిక్చర్స్ బ్యానర్ పై రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాను జానకి రామ్ మారెళ్ళ డైరెక్ట్ చేస్తున్నారు. మహిమా నంబియార్ (Mahima Nambiar) ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. రాధికా శరత్ కుమార్, షైన్ టామ్ బావ్కో, ఉపేంద్ర లిమాయే, శత్రు, సాయిచంద్, బ్రహ్మాజీ, తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు.
ఈ సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న వెలువడ నుండి. ఈ విషయాన్ని తెలియచేస్తూ మేకర్స్ విడుదల చేసిన వీడియో గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని కలిగిస్తోంది. గన్స్, గ్రనైడ్, రోజ్ ఫ్లవర్స్, ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో దీనిని డిజైన్ చేశారు. కింగ్ ఆఫ్ ఎంటర్ టైన్ మెంట్స్ గా పేరు తెచ్చుకున్న శ్రీవిష్ణు... కాస్తంత భిన్నమైన కథనే ఈ సినిమాకు ఎంచుకున్నట్టు ఈ గ్లింప్స్ చూస్తే అర్థమౌతోంది. విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సాయి శ్రీరామ్ డీవోపీగా వ్యవహరిస్తున్నారు.