సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Nuvvu Naaku Nachav: నువ్వు నాకు నచ్చావ్.. సీక్వెల్‌! నిర్మాత.. ఏమ‌న్నాడంటే?

ABN, Publish Date - Dec 31 , 2025 | 06:34 AM

నువ్వు నాకు నచ్చావ్ చిత్రం విడుదలై పాతికేళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని జనవరి 1న రీ రిలీజ్ చేస్తున్నారు.

Nuvvu Naaku Nachav

నువ్వు నాకు నచ్చావ్ (Nuvvu Naku Nachav) చిత్రం విడుదలై పాతికేళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని జనవరి 1న రీ రిలీజ్ చేస్తున్నారు. కే విజయ భాస్కర్ (Vijaya Bhaskar) దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ (Trivikram Srinivas) రచనా సహకారం అందించారు. ఈ చిత్రం రీ రిలీజ్ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆ సినిమా సృష్టించిన అద్భుతమైన జ్ఞాపకాలను నిర్మాత స్రవంతి రవికిశోర్ (Sravanthi Ravi Kishore), దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పంచుకున్నారు.

'నువ్వు నాకు నచ్చావ్' సినిమా విజయంలో వెంకటేశ్ పాత్రను త్రివిక్రమ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. 'కథ విన్నవెంటనే వెంకటేశ్ ఈ సినిమా చేసేందుకు అంగీకరించారు. సినిమాలో ఒక్క ఫైట్ కూడా ఉండదు. పూర్తి క్యారెక్టర్ బేస్డ్ కథ. అయినా ఎంతో నమ్మకంతో చేశారు.

డైలాగ్ వెర్షన్ పూర్త య్యాక స్క్రిప్ట్ను రెండు మూడు సార్లు చదివి పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశారు. నేటికి ప్రేక్షకుల హృదయాల్లో ఈ చిత్రం నిలిచిపోయిందంటే కారణం వెంకటేశ్ గారి అద్భుత నటనే' అని ప్రశంసించారు. జనవరి 1న థియేటర్లలో విడుదలవుతున్న ఈ క్లాసికల్ మూవీని మళ్లీ చూసి ఎంజాయ్ చేయాలని స్రవంతి రవికిశోర్ ప్రేక్షకులను కోరారు.


అయితే.. ఓ విలేఖ‌రి ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందా, ఫ్లాన్ చేస్తారా అని అడ‌గ‌గా.. ఆలోచ‌న బావుంది గానీ అలాంటి ఉద్దేశం లేదని, వీలు ప‌డ‌ద‌ని, నువ్వు నాకు న‌చ్చావ్ అనేది ఒక్క సినిమానే అని నిర్మాత ర‌వి కిశోర్‌ తేల్చి చెప్పారు.

Updated Date - Dec 31 , 2025 | 06:47 AM