80s Stars Reunion: తారల.. 80's సెలబ్రేషన్స్.. రెండు కళ్లు చాలవు
ABN, Publish Date - Oct 05 , 2025 | 10:42 AM
సౌత్ సినిమా ఇండస్ట్రీకి చెందిన 1980 తారలు అంతా ప్రతి సంవత్సరం ఓ దగ్గర చేరి తమదైన శైలిలో హంగామా చేసే సంగతి తెలిసిందే.
సౌత్ సినిమా ఇండస్ట్రీకి చెందిన 1980 తారలు అంతా ప్రతి సంవత్సరం ఓ దగ్గర చేరి తమదైన శైలిలో హంగామా చేసే సంగతి తెలిసిందే. గత పుష్కర కాలంగా ఈ కార్యక్రమం జరుగుతూ వస్తుంది. ప్రతి సంవత్సరం సౌత్‌లో ఏదో ఒక స్టేట్‌లో ఈ వేడకను నిర్వహించి హీరో హీరోయిన్లు అంతా ఆడుతూ పాడుతూ నాటి రోజులను గుర్తు చేసుకుంటూ ఉంటారు.
గతంలో జరగాల్సిన ఈ గెట్ టూ గెదర్ పార్టీలు వర్షాలు, వరదల వళ్ల వాయిదా పడగా ఎట్టకేలకు మూడు సంవత్సరాల విరామం తర్వాత ఈ వేడుకను ఈ మారు నాటి హీరోయిన్ శ్రీప్రియ - రాజ్‌కుమార్ సేతుపతి జంట ఈ పార్టీని చెన్నైలో నిర్వహించారు.
తాజాగా ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను చిరంజీవి తన సోషల్ మీడియా వేదిక ద్వారా పంచుకున్నారు. ఈ ఫొటోల్లో భానుచందర్, సురేశ్, నరేశ్, శరత్ కుమార్, జయరాం, జాకీష్రాఫ్, రెహమాన్, భాగ్యరాజా వంటి నటులు హజర్యయారు, అలనాటి కథానాయికలు జయసుధ, రాధ, సుహాసిని, లిజి, రేవతి, రమ్యకృష్ణ, మీనా, ఖుష్బూ, నదియా వంటి మొత్తంగా 31 మంది తారలు సైతం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారంతా చిరుత థీమ్ డ్రెస్ కోడ్ ఫాలో అవడం విశేషం. ఈ ఫొటోలను మీరూ ఓ సారి వీక్షించేయండి.
ఈ వేడుకలో రజనీకాంత్, కమల్ హసన్, బాలకృష్ణ, నాగార్జున, సుమన్, రాజశేఖర్, రాజేంద్ర ప్రసాద్, మోహన్ లాల్, మమ్ముట్టి, సత్యరాజ్, మోహన్ బాబు వంటి స్టార్లు మిస్సయ్యారు.