Spirit: ప్రభాస్ ఫ్యాన్స్‌కు.. డబుల్ బొనాంజా! అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా
ABN, Publish Date - Oct 23 , 2025 | 11:30 PM
ప్రభాస్ హీరోగా, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ డ్రామా చిత్రం స్పిరిట్.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (PRABHAS) హీరోగా, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ డ్రామా చిత్రం స్పిరిట్ (Spirit). అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, అనిమల్ లాంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న వంగా, ఈసారి ప్రభాస్‌తో కలిసి ఒక విభిన్నమైన మాస్ ఎమోషనల్ పోలీస్ డ్రామాను తెరకెక్కించబోతున్నాడు.
అయితే.. ఈ సినిమా నుంచి ప్రతీ రోజు కొత్త కొత్త అప్‌డేట్లు వస్తూ ఫ్యాన్స్ ను అంతకంతకు అంచనాలు పెంచేస్తూనే ఉన్నాయి. కాగా ఈ రోజు గురువారం ప్రభాస్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఈ సినిమా మేకర్స్ ఫ్యాన్స్ ను సర్‌ఫ్రైజ్ చూస్తూ రాత్రి 11 గంటలకు ది సౌండ్ స్టోరి ఆఫ్ ద ఫిల్మ్ స్పిరిట్ (The Sound Story Of The Film Spirit.) అంటూ నిమిషం 31 సెకండ్ల నిడివి ఉన్న అడియో గ్లిమ్స్ రిలీజ్ చేశారు. దీనిని చూస్తే సినిమాలో సౌండ్ బ్యాక్‌బోన్‌లా పనిచేస్తుందని అర్థమవుతోంది.
తాజాగా విడుదల చేసిన ఈ గ్లిమ్స్ లో ఐఎస్ ఐపీఎస్ అఫీసర్ అయిన ప్రభాస్ అరెస్ట్ అయి జైలుకు వెళ్లడం అక్కడ జైల్ అధికారి అయిన ప్రకాశ్ రాజ్ ప్రభాస్ క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ వీడి గురించి విన్నాను యూనిఫాంతో ఉన్నా లేకున్నా బీహేవియర్‌లో తేడా ఉండదని.. చూద్దాం ఈ ఖైదీ యూనిఫాంలో ఎలా ఉంటాడో. వీడి బట్లు ఊడదీసి మెడికల్ టెస్టులకు పంపించండి వంటి సందీప్ మార్క్ డైలాగులతో ఈ ప్రోమో అదిరింది. చివరలో ప్రభాస్ వచ్చి మిస్టర్ సూపరింటెండెంట్ నాకు చిన్నప్పటి నుంచి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉందంటూ చెప్పడం గ్లిమ్స్ మొత్తానికే హైలెట్‌గా నిలిచింది.
ప్రభాస్ 25వ సినిమాగా పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో భద్రకాళి పిక్చర్స్, టి-సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాగా ఇప్పటికే ప్రారంభం కావాల్సిన ఈ సినిమా షూటింగ్ ప్రీ-ప్రొడక్షన్ పనుల కారణంగా కాస్త వాయిదా పడిందని సమాచారం. త్వరలోనే షూటింగ్ ప్రారంభఙంచి 2026లో ప్రజలు ఎదుటకు తీసుకు వచ్చేందుకు ఫ్లాన్ చేశారు. కాగా ఈ మూవీలో అలనాటి నటి కాంచన, బాలీవుడ్ స్టార్ వివేక్ ఒబేరాయ్, త్రిప్తీ డిమ్రీ, ప్రకాశ్‌రాజ్ కీలక పాత్రలు చేస్తున్నారు.
ఇదిలాఉంటే.. ఈ ఫౌజీ సినిమాతో కొత్తగా సౌండ్ స్టోరీ అంటే ఓ ప్రయోగం చేస్తూ ఇండియన్ సినిమా హాస్టరీలో సరికొత్త సాంప్రదాయానికి తెర దీశాడు సందీప్ రెడ్డి వంగా. షూటింగ్‌కు ముందే 70% బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ను సిద్ధం చేశాం. ఆ సౌండ్ ఆధారంగా షూట్ ప్లాన్ చేస్తున్నాం అని ఆయన తెలిపారు. సాధారణంగా సినిమాకు మ్యూజిక్ తర్వాత జతచేస్తారు. కానీ వంగా మాత్రం ముందు సౌండ్ డిజైన్ చేసి, దానికి తగ్గట్టు షాట్లు తెరకెక్కిస్తున్నారు. ఇది సినిమాలో ఆడియో – విజువల్ అనుభవాన్ని మరింత బలంగా, సహజంగా ఉండేలా చేస్తుందని ఆయన చెప్పారు.