Sonu Sood : ఇంట్లోనే పామును పట్టుకున్న సోను సూద్
ABN, Publish Date - Jul 21 , 2025 | 05:06 AM
బాలీవుడ్ నటుడు సోనూసూద్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియో ఒకటి ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది...
బాలీవుడ్ నటుడు సోనూసూద్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియో ఒకటి ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ముంబైలోని తన నివాసం దగ్గర్లో విషపూరితం కాని ఒక పామును ఆయన ఎంతో చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ వీడియోను తన ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ చేశారు. ‘ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది మీరు ప్రయత్నించొద్దు. ఇటువంటి పరిస్థితి ఎదురైతే నిపుణులను సంప్రదించండి. జాగ్రత్తగా ఉండండి’ అని పేర్కొన్నారు.