సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

సోలో బాయ్‌ విజయం సాధించాలి

ABN, Publish Date - Jul 03 , 2025 | 05:32 AM

గౌతమ్‌కృష్ణ, రమ్య పసుపులేటి జంటగా నటించిన ‘సోలో బాయ్‌’ చిత్రం ఈ శుక్రవారం విడుదలవుతోంది. నవీన్‌కుమార్‌ దర్శకత్వంలో సెవెన్‌ హిల్స్‌ సతీశ్‌ నిర్మించిన...

గౌతమ్‌కృష్ణ, రమ్య పసుపులేటి జంటగా నటించిన ‘సోలో బాయ్‌’ చిత్రం ఈ శుక్రవారం విడుదలవుతోంది. నవీన్‌కుమార్‌ దర్శకత్వంలో సెవెన్‌ హిల్స్‌ సతీశ్‌ నిర్మించిన ఈ సినిమా ప్రీ రిలీజ్‌ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన దర్శకుడు వీవీ వినాయక్‌ మాట్లాడుతూ ‘దర్శకుడిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి, స్వయంకృషితో నిర్మాతగా ఎదిగిన సతీశ్‌ను అభినందిస్తున్నాను. ఈ సినిమా విజయం సాధించి ఆయన ప్రయాణానికి తోడ్పడాలని కోరుకుంటున్నాను’ అని చెప్పారు. సతీశ్‌ మాట్లాడుతూ ‘గౌతమ్‌కృష్ణ కెరీర్‌లో ఈ చిత్రం ఓ మైల్‌ స్టోన్‌ అవుతుంది’ అన్నారు.

Updated Date - Jul 03 , 2025 | 05:32 AM