Mrunal Thakur: ఇదేం ఫొటోషూట్ రా.. బోల్డ్ అవతారంలో మృణాల్
ABN, Publish Date - Oct 07 , 2025 | 07:20 AM
బాలీవుడ్ ముద్దుగుమ్మ.. టాలీవుడ్ హార్ట్‌త్రోబ్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) తన హట్‌నెస్‌తో మరోమారు రెచ్చిపోయింది.
బాలీవుడ్ ముద్దుగుమ్మ.. టాలీవుడ్ హార్ట్‌త్రోబ్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) తన హట్‌నెస్‌తో మరోమారు రెచ్చిపోయింది. ఇప్పటికే తెలుగు, హిందీ భాషల్లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ ముద్దుగమ్మ.. అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉంది.
సమయం దొరికితే కమర్షియల్ యడ్స్ చూస్తూ రెండు చేతులా ఆర్జిస్తుంది. సామాజిక మాధ్యమాల్లోనూ యాక్టివ్‌గా ఉంటే ఈ చిన్నది తరుచూ తన డిఫరెంట్ ఫొటోషూట్లతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది.
తాజాగా చేసిన షూట్ ఫొటోలు నెట్టింట దర్శణమివ్వడంతో అంతా షాకవుతున్నారు. కట్–అవుట్–అవుట్ డిజైన్ ప్రత్యేకంగా రూపొందించిన తెల్లటి టెక్స్చర్డ్ గౌన్‌లో వివిధ భంగిమల్లో బోల్డ్‌గా చేసిన ఫొటో షూట్ చూసే వారికి చాలా మందికి కనుల విందు చేయగా మరికొంత మంది మాత్రం డిస్ట్రబ్ అవుతున్నారు.
మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ఏంటి ఇలా చేస్తుంది. అవకాశాలు బాగానే ఉన్నాయి కదా ఇప్పుడు ఇలాంటి ప్రదర్శణలు ఎందుకు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇదేం ఫొటోషూట్ రా.. ఇలా తయారేంట్రా అని విమర్శలు చేస్తున్నారు.