Sobhita Akkineni: వివాదాస్పదమైన సినిమాపై అక్కినేని కోడలి ప్రశంసలు..
ABN, Publish Date - Nov 11 , 2025 | 02:42 PM
ఇండస్ట్రీలో వివాదాస్పదమైన సినిమాలు చాలానే ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఏ చిన్న తప్పు దొర్లినా కూడా దాన్ని పెద్దది చేసి సోషల్ మీడియాలో వైరల్ గా మారుస్తున్నారు.
Sobhita Akkineni: ఇండస్ట్రీలో వివాదాస్పదమైన సినిమాలు చాలానే ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఏ చిన్న తప్పు దొర్లినా కూడా దాన్ని పెద్దది చేసి సోషల్ మీడియాలో వైరల్ గా మారుస్తున్నారు. ఇక ఈ సినిమా ఎంత బావున్నా కూడా వివాదం అవుతుందేమో అనుకోని సెలబ్రిటీలు నోరు విప్పరు. కానీ, అక్కినేని కోడలు శోభితా (Sobhita) అలా చేయలేదు. వివాదాస్పదమైన సినిమాపై ప్రశంసలు కురిపించింది. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. అక్కినేని కోడలిని అంతగా మెప్పించిన సినిమా ఏది అంటే.. బ్యాడ్ గర్ల్ (Bad Girl).
అంజలి శివరామన్ ప్రధాన పాత్రలో వర్ష భరత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం బ్యాడ్ గర్ల్. వెట్రిమారన్, అనురాగ్ కశ్యప్ నిర్మించిన ఈ సినిమా టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచే వివాదాలను ఎదుర్కొంటుంది. ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన అమ్మాయి.. తన యుక్త వయస్సులని లైంగిక కోరికల గురించి చెప్పడం, వాటిని తీర్చుకోవడానికి తహతహలాడడం లాంటివి చూపించడంతో బ్రాహ్మణ సంఘాలు మండిపడ్డాయి. ఈ సినిమాను బ్యాన్ చేయాలనీ డిమాండ్ చేశాయి.
ఇక బ్యాడ్ గర్ల్ సినిమా సెప్టెంబర్ లో రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ ను అందుకుంది. వివాదం వలన ఎక్కువ పేరు తెచ్చుకోలేకపోయిన ఈ సినిమా ఈ నెల నుంచే జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. సినిమా బావున్నా కూడా వివాదం అవుతుందేమో అన్న భయంతో ఎవరు కూడా ఈ చిప్త్రంపై స్పందించలేదు. తాజాగా అక్కినేని కోడలు శోభితా మాత్రం బ్యాడ్ గర్ల్ చిత్రం తనకు బాగా నచ్చిందని పోస్ట్ పెట్టింది.
'బ్యాడ్ గర్ల్.. నన్ను నవ్వించింది.. కన్నీళ్లు పెట్టించింది. మంచి సినిమా చూసిన అనుభూతిని అందించింది. అందరూ చూడాల్సిన సినిమా.. ముఖ్యంగా అమ్మాయిలకు ఈ చిత్రాన్ని నేను సిఫార్సు చేస్తున్నాను. ఇది మనకోసం.. వర్ష భరత్ మరియు అంజలి శివరామన్ ను అభినందించాలి' అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఒక్కసారిగా ఈ సినిమాపై ఎక్కడలేని హైప్ వచ్చేసింది. మరి అక్కినేని కోడలి పోస్ట్ వలన ఈ సినిమా రాత మారుతుందేమో చూడాలి.