సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

SKN: బంగారు తల్లులూ.. వ‌దిలేయాల్సింది చున్నీలు కాదు

ABN, Publish Date - Nov 13 , 2025 | 12:53 PM

‘ది గర్ల్‌ఫ్రెండ్‌’లో చున్నీ సీన్‌ వైరల్‌ – రాహుల్‌ రవీంద్రన్‌కి ఆడియన్స్‌ రియాక్షన్‌, SKN ఫన్నీ కౌంటర్‌!

skn

బుధ‌వారం హైద‌రాబాద్‌లో ర‌ష్మిక మంద‌న్న (Rashmika Mandanna) ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన ది గ‌ర్ట్‌ఫ్రెండ్ (The Girlfriend) స‌క్సెస్ మీట్ నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి విజ‌య్ దేవ‌ర‌కొండ‌, అల్లు అర‌వింద్‌, ద‌ర్శ‌కుడు సాయి రాజేవ్‌, నిర్మాత ఎస్కేఎన్ వంటి ప్ర‌ముఖు అతిధులుగా హ‌జ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా SKN మాట్లాడుతూ.. సినిమా అవ‌శ్య‌క‌త‌ను వివర‌స్తూనే విజ‌య్ దేవ‌ర‌కొండ, అల్లు అర‌వింద్‌ల గొప్ప‌త‌నాన్ని తెలియ‌జేస్తూ బండ్ల గ‌ణేశ్‌కు కౌంట‌ర్ ఇచ్చారు. అంతేగాక ఇటీవ‌ల ఈ సినిమా విష‌యంలో వ‌చ్చిన ఓ కాంట్ర‌వ‌ర్సీపై కూడా త‌న స్టైల్‌లో కౌంట‌ర్ ఇచ్చాడు.

వివ‌రాల్లోకి వెళితే.. ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ సినిమా రిలేషన్‌షిప్‌లలో అమ్మాయిలు అబ్బాయిల నుంచి ఎదుర్కొనే టాక్సిక్‌ బిహేవియర్‌ను నిజజీవితానికి దగ్గరగా చూపించింది. ఈ కంటెంట్ కొంత‌మంది మ‌హిళా ప్రేక్షకులను బాగా కనెక్ట్‌ చేసింది. ముఖ్యంగా అనేక మంది యువతులు సోషల్‌ మీడియాలో తమ భావాలను, అనుభవాలను షేర్‌ చేస్తూ “మేము కూడా అలా ఫేస్‌ చేశాం” అంటూ రివ్యూలు పోస్ట్ చేశారు. బాహాటంగానే త‌మ అభిప్రాయాలు వెలిబుచ్చుతున్నారు.

అయితే.. ఇటీవల దర్శకుడు రాహుల్‌ రవీంద్రన్‌ ఓ థియేటర్‌కి వెళ్లినప్పుడు ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. సినిమా చూసిన తర్వాత ఓ యువతి ఆయన దగ్గరకు వచ్చి “సినిమా చివర్లో రష్మిక చున్నీ తీసేసినట్టు, నేను కూడా నా భయాలను వదిలేస్తున్నా” అంటూ మెడలో ఉన్న చున్నీని తీసేసింది. ఆ క్షణంలో రాహుల్‌ ఆమెను హత్తుకొని ప్రోత్సాహపరిచాడు. ఈ సన్నివేశం వీడియోగా మారి సోషల్‌ మీడియాలో వేగంగా వైరల్‌ అయింది. అయితే ఈ ఘటనపై ప‌లువురు నెటిజన్లు విమ‌ర్శ‌లు గుప్పించారు.

ఈ ఇష్యూపైనే నిర్మాత SKN సక్సెస్‌ మీట్‌లో వ్యంగ్య‌స్త్రాలు సంధించారు. “బంగారు తల్లులూ.. రాహుల్‌ గారు ఈ సినిమా తీసింది మీలో భయాన్ని పోగొట్టడానికి మాత్రమే. చున్నీలు ఎగరేయమని కాదు. బట్టల షాపులు మా ఆఫీస్‌ ముందు లైన్‌లో ఉన్నాయి.. ‘చున్నీ సేల్స్‌ పడిపోతున్నాయి’ అని అంటున్నారు. కంఫర్ట్‌గా ఉండే దుస్తులు వేసుకోండి కానీ ఈ సినిమా మెసేజ్‌ భయాన్ని వదిలేయండి, అంతే తప్ప ఇంకేమీ వదిలేయమని కాదు” అని స్ప‌ష్టం చేశారు. ఇప్పుడీ స్పీచ్‌, థియేటర్‌ ఘటన కలిసి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Updated Date - Nov 13 , 2025 | 12:53 PM