Sivaji: ఆరోజు నిధి అగర్వాల్ డ్రెస్ జారితే.. నా స్టేట్మెంట్ ని మార్చుకోను
ABN, Publish Date - Dec 24 , 2025 | 04:25 PM
నటుడు శివాజీ (Sivaji) పేరు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విషయం తెల్సిందే. ఆయన నటించిన దండోరా సినిమా ప్రీ మీట్ లో హీరోయిన్ల గురించి ఘాటు వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది.
Shivaji: నటుడు శివాజీ (Sivaji) పేరు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విషయం తెల్సిందే. ఆయన నటించిన దండోరా సినిమా ప్రీ మీట్ లో హీరోయిన్ల గురించి ఘాటు వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. హీరోయిన్లు బయటకు వచ్చేటప్పుడు పద్దతిగా చీరకట్టుకొని రావాలని.. చిన్న బట్టలు వేసుకొని సామాన్లు కనిపించేలా వస్తే.. ఏంటి ఇది దరిద్రపు ముండా అన్నట్లు మాట్లాడతారని, అలాంటి మాటలు రాకుండా ఉండడానికి పద్దతిగా ఉండమని చెప్పుకొచ్చాడు. ఇక ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో సంచలనంగా మారాయి. అందరూ శివాజీ చేసిన వ్యాఖ్యలు తప్పుపడుతూ. అతనిని నిందించారు.
ఇక దీంతో శివాజీ తాను చేసిన వ్యాఖ్యలకు ఆడవారికి క్షమాపణలు చెప్పుకొచ్చాడు. అయితే నేను నా స్టేట్మెంట్ ని వెనక్కి తీసుకోను కానీ, తన నోటి నుంచి వచ్చిన ఆ రెండు అసభ్యకరమైన పదాల వలన ఆడబిడ్డలు హర్ట్ అయితే క్షమించమని కోరాడు. ఇక తాజాగా ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ.. నా స్పీచ్ లో డొర్లిన అసభ్య పదాలకు నేను సారీ చెబుతున్నాను. ఆరోజు స్టేజ్ మీద నాతో పాటు ఉన్న ఆడబిడ్డలకు క్షమాపణలు కోరుతున్నాను. నా 30 ఏళ్ల కెరీర్ లో ఎప్పుడు ఇలా జరగలేదు. వై ఎస్ జగన్ ను కూడా విమర్శించాను కానీ .. ఇలా ఎప్పుడు అనలేదు. నేను ఇచ్చిన స్టెట్మెంట్ కు మాత్రం కట్టుబడే ఉన్నాను.. ఆ రెండు పదాలు మాత్రం తప్పు.. అందుకు క్షమాపణలు కోరుతున్నాను.
స్త్రీల గురించి చాగంటి, గరికపాటి గారు సీనియర్స్ జర్నలిస్ట్ లు పెద్దలు గతంలో చాలాసార్లు చెప్పారు. నేను మొన్న నిధి అగర్వాల్ పై జరిగిన సంఘటన చూసి, సమంత గారికి జరిగినది చూసి మాట్లాడాను. నేను ఎవ్వరిని ఈ డ్రెస్ లు వేసుకోండని చెప్పలేదు. సమాజం సినిమాల వల్ల చెడిపోతుందనే వారికి.. అవకాశం ఇవ్వకూడదనేదె నా ఆలోచన. అయినా నా నోటి నుంచి రెండు రాంగ్ వర్డ్స్ వచ్చాయి. అది నాకు అర్దమయ్యి వెంటనే నా భార్యకు కొడుకుకు సారీ చెప్తూ మెసెజ్ లు పెట్టాను. వీడియో కూడా రికార్డు చేశాను. నా కామెంట్స్ ను చిన్మయికి, అనసూయకు సోషల్ మీడియాలో ట్యాగ్ చేశారు. నా ఇంటెన్షన్ బ్యాడ్ కాదు.. ఇప్పటికీ నా నోటి నుంచి ఎలా వచ్చాయనేది అర్దం కావట్లేదు. నేను చేసింది తప్పు అపాలజీ కావాలని చెప్పొచ్చు. సుప్రియ గారు ఫోన్ చెస్తే .. సారీ చెప్పాను. మిగతా వారు ఏపీ, తెలంగాణ ప్రభుత్వం మహిళా కమీషన్ ఇలా ట్యాగ్ లు చేస్తూ పోయారు.నేను ఎవరితో అయినా మిస్ బిహేవ్ చేసానా.. చేయను కూడా. సారీ చెప్పటం నా భాద్యత.. చెప్పాను. ఇంతకన్నా పెద్ద ఇష్యూ వచ్చే వరకు నా ఇష్యూ ఇలా వెళుతూనే ఉంటుంది.
ఒకవేళ ఆరోజు నిధి అగర్వాల్ డ్రెస్ జారితే .. ఎంత దారణం జరిగి ఉండేది. అందుకే జాగ్రత్తగా ఉండమని చెప్పాలనుకున్నాను. అయినా నాకంటే పెద్ద పదాలు ఎవరు వాడలేదా ఈ పరిశ్రమలో. నేను మాత్రమే మహిళా కమీషన్ కు వెళ్లాలా..?నా వైపు పొరపాటు జరిగింది. చిన్నయి మహిళా కమీషన్ కు వెళితే వారు నన్ను రమ్మనటం ఏంటో .. నాకర్ధం కావడం లేదు. నేను వెళతాను.. నా వివరణ ఇచ్చుకుంటాను. భారత రాజ్యంగం హక్కులతో పాటు బాధ్యత కూడా ఇచ్చింది. ప్రొవొకింగ్ ఆల్సో క్రైమ్. మీ డ్రెస్ లు మీ ఇష్టం.. నేనెవరిని చెప్పటానికి.. హక్కులను హరించటానికి అని అంటున్నారు. నిధి అగర్వాల్ కోసం ఉమెన్ ఎవరైనా మాట్లాడారా.. నేను మాట్లాడాను. ఆమె బయటనుంచి వచ్చిన అమ్మాయి.. మనం చెప్పాలి జాగ్రత్తగా ఉండమని.. అదే చెప్పాను. మీకేంటి అని అనసూయ అడుగుతుంది. ఆమె ఎందుకు వచ్చింది ఈ ఇష్యూలోకి.. సమాజంలో ఎదైనా జరిగితే.. నేను మాట్లాడతాను.
శివాజీ కామెంట్స్ కంటే ముందు చాలా జరిగాయి. వాటిపై ఎందుకు ఎవరు మాట్లాడలా. విత్ గుడ్ ఇంటెన్షన్ లో మాట్లాడినా.. ఆ రెండు పదాలు తప్పు. నేను తప్పు చెస్తే సారీ చెప్పటానికి వెనకాడను. అనసూయ నాకు ఇన్ సెక్యూరిటీ ఉందన్నారు.. ధన్యవాదాలమ్మా. నాకు మా హీరోయిన్స్ ఇబ్బంది పెడతారనే ఇన్ సెక్యూరిటీ ఉంది.అనసూయ మీ రుణం తీర్చుకుంటాను. నాకు ఈ ఇష్యూ లో సారీ చెప్పాక ఎంతోమంది ఫోన్ చేశారు. నా ఇంటెన్షన్ ఆడపిల్లలను రక్షించుకోవాలనే అందుకే నాకు తోచింది నేను చెప్పాను. సోషల్ మీడియాలో ఒకటి చూసా.. ఎప్పడున్నా సాయిపల్లవి ,లయ అనుష్క, సౌందర్య భూమిక లను ఎవరన్నా టచ్ చేశారా అని. అలాంటివేమీ లేవు. ఆడపిల్లలు మీ ఇష్టమొచ్చిన డ్రెస్ లు వేసుకొండి.. మీఇష్టం. జరిగే అనర్దాల గురించి మాత్రమే నేను అలెర్ట్ చేసే ప్రయత్నం చేశాను' అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం శివాజీ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.