Dharma Mahesh: భార్యపై వేధింపులు.. కుర్ర హీరోపై కేసు నమోదు

ABN , Publish Date - Aug 18 , 2025 | 08:43 PM

టాలీవుడ్ కుర్ర హీరో ధర్మ మహేష్ (Dharma Mahesh) పై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. భార్య గౌతమి.. తనను అదనపు కట్నం కోసం ధర్మ మహేష్, అతని కుటుంబ సభ్యులు వేధింపులకు గురిచేస్తున్నారని గచ్చిబౌలి మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

Dharma Mahesh

Dharma Mahesh: టాలీవుడ్ కుర్ర హీరో ధర్మ మహేష్ (Dharma Mahesh) పై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. భార్య గౌతమి.. తనను అదనపు కట్నం కోసం ధర్మ మహేష్, అతని కుటుంబ సభ్యులు వేధింపులకు గురిచేస్తున్నారని గచ్చిబౌలి మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. గౌతమి (Gowthami) ఫిర్యాదుతో ధర్మ మహేష్ పై, అతని కుటుంబ సభ్యులపై పలు సెక్షన్స్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.


ధర్మ మహేష్ తెలుగులో సింధూరం, డ్రింకర్ సాయి లాంటి సినిమాలతో కొద్దిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ధర్మ మహేష్ కు 2013లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గౌతమి (31) తో పరిచయం ఏర్పడింది. కొన్నేళ్ళకు వారి పరిచయం ప్రేమగా మారగా 2019లో వీరు వివాహం చేసుకున్నారు. గౌతమి, ఆమె తండ్రి అందించిన ఆర్థిక సహకారంతో ఇద్దరు కలిసి ఓ హోటల్ ఫ్రాంచైజీ వ్యాపారాన్ని సైతం ప్రారంభించారు. కాగా ఈ మధ్యకాలంలో సినిమా అవకాశాలు పెరగడంతో జల్సాలకు అలవాటు పడిన ధర్మ మహేష్, యువతులతో తిరుగుతూ భార్యను వేధింపులకు గురి చేయసాగాడు. ప్రస్తుతం తన స్టేటస్ పెరిగిందని.. అదనపు కట్నం కావాలంటూ ధర్మ మహేష్, అతని కుటుంబ సభ్యులు గౌతమిని వేధిస్తున్నారు.


గౌతమి డబ్బుతో ప్రారంభించిన హోటల్ ఫ్రాంచైజీ ని సైతం తన పేరు మీదకు మార్చుకున్నాడు. ధర్మ మహేష్, అతని కుటుంబ సభ్యుల శారీరక, మానసి వేధింపులకు విసిగిపోయిన భార్య గౌతమి పోలీసులను ఆశ్రయించింది. దీంతో గచ్చిబౌలి మహిళా పోలీస్ స్టేషన్ లో హీరో ధర్మ మహేష్ మీద బి.ఎన్.ఎస్ సెక్షన్ 85, 115(2), 316(2), 351(2), 352, సెక్షన్ 4 ఆఫ్ డిపి యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ధర్మ మహేష్ గతంలో సైతం వేధింపుల గురి చేయడంతో పోలీసులను ఆశ్రయించగా పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారని కానీ ధర్మ మహేష్ తీరు మారకపోవడంతో మరోసారి పోలీసులను ఆశ్రయించినట్లు గౌతమి తన ఫిర్యాదులో తెలిపింది.ప్రస్తుతం పోలీసులు గౌతమి ఫిర్యాదు అందుకొని విచారణ చేపట్టారు.

Dhanunjay: సందేశాత్మకంగా 'ఉతుకు పిండు ఆరెయ్' గీతం

Shootings Bandh: చిరంజీవితో సినీ కార్మికుల మిలాఖత్

Updated Date - Aug 18 , 2025 | 08:43 PM