సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Telusu Kada: సిద్ధు సినిమాకు.. ఆ సర్టిఫికెట్‌! నిడివి ,సెన్సార్ రిపోర్ట్ ఇదే

ABN, Publish Date - Oct 13 , 2025 | 07:50 AM

సిద్ధు జొన్నలగడ్డ కథానాయకుడిగా ప్ర‌ముఖ స్టైలిస్ట్‌ నీరజ కోన తెరకెక్కించిన చిత్రం ‘తెలుసు కదా’.

Telusu Kada

సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) కథానాయకుడిగా ప్ర‌ముఖ స్టైలిస్ట్‌ నీరజ కోన (Neerraja Kona) తెరకెక్కించిన చిత్రం ‘తెలుసు కదా’(Telusu Kada). రాశీ ఖ‌న్నా (Raashii khanna), శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) క‌థానాయిక‌లుగా న‌టించగా పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) బేనర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ (TG Vishwa Prasad), కృతి ప్రసాద్ (Krithi Prasad) నిర్మించారు. త‌మ‌న్ (Thaman S) సంగీతం అందించాడు. దీపావ‌ళి ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని ఆక్టోబ‌ర్‌17న ప్రేక్ష‌కుల ఎదుట‌కు రానుంది. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన పాట‌లు, టీజ‌ర్ సినిమాపై ఓ స్థాయిలో అంచ‌నాల‌ను క్రియేట్‌ చేశాయి.

అయితే సినిమా విడుదల‌కు మ‌రో మూడు నాలుగైదు రోజుల స‌మ‌యం మాత్ర‌మే ఉండ‌డంతో మేక‌ర్స్, హీరో హీరోయున్లు సినిమా ప్ర‌మోష‌న్ల‌లో వేగం పెంచారు. కాలేజీలు, మాల్స్‌, స్టూడియోలు ఇలా ప్ర‌తి ప్ర‌చార యుక్త‌మైన అన్ని అవ‌కాశాల‌ను స‌ద్వినియోగం చేసుకుంటూ ప్ర‌చారంలో దూసుకెళుతున్నారు.

ఇదిలాఉంటే .. తాజాగా ఈ సినిమా సెన్సార్‌ పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్‌ పొందింది. 2 గంట‌ల 16 నిమిషాల నిడివితో సినిమా ఉండ‌నున్న‌ట్లు తెలిసింది. నేటి యూత్‌కు క‌నెక్ట్ అయ్యే టాపిక్‌తో అంత‌ర్లీనంగా మెసేజ్ ఇస్తూ ఔట్ అండ్ ఔట్ కామెడీ, సింగిల్ టైన‌ర్ పంచుల‌తో సాగే సినిమాగా ‘తెలుసు కదా’(Telusu Kada) ఉండ‌నుంది. ఈ రోజు (సోమ‌వారం, ఆక్టోబ‌ర్ 13)న ట్రైల‌ర్ రిలీజ్ కానుంది.

Updated Date - Oct 13 , 2025 | 07:57 AM