Badass: బ్యాడాస్ గా మారిన సిద్దు జొన్నలగడ్డ
ABN, Publish Date - Jul 09 , 2025 | 01:30 PM
సిద్దు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda) డీజే టిల్లు(DJ Tillu) సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారాడు.
Badass: సిద్దు జొన్నలగడ్డ(Siddhu Jonnalagadda) డీజే టిల్లు(DJ Tillu) సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారాడు. ఈ సినిమా ఇచ్చిన ఏ రేంజ్ లో హిట్ అయ్యింది అంటే.. అంతకుముందు సెకండ్ హీరోగా నటించిన సిద్దు.. హీరోగా తప్ప ఇంకే పాత్రలో కూడా కనిపించను అనేంతలా మార్చింది. ఇక ఈ సినిమా తరువాత టిల్లు స్క్వేర్ తో మరో మంచి విజయాన్ని అందుకున్న సిద్దు.. ఆ తరువాత అలాంటి హిట్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు. టిల్లు స్క్వేర్ తరువాత వచ్చిన జాక్.. భారీ పరాజయాన్ని చవిచూసింది.
ఇక ఎలాగైనా ఈసారి సిద్దు మంచి విజయం అందుకోవడం కోసంకష్టపడుతున్నాడు . ప్రస్తుతం సిద్దు చేతిలో తెలుసు కదా అనే సినిమా ఉంది. ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా ఇంకా రిలీజ్ కాకముందే సిద్దు మరో సినిమాను పట్టాలెక్కించాడు. ఎప్పటినుంచో సిద్దు జొన్నలగడ్డ సితార ఎంటర్ టైన్మెంట్స్ లో ఒక సినిమా చేస్తున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెల్సిందే. ఇక ఎట్టకేలకు ఆ చిత్రాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
కృష్ణ అండ్ హిజ్ లీల, బబుల్ గమ్ సినిమాలతో సుపరిచితుడు అయిన డైరెక్టర్ రవికాంత్ పేరుపు దర్శకత్వంలో సిద్దు నటిస్తున్న కొత్త చిత్రం బ్యాడాస్. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు టైటిల్ ను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. ' మీరు ఇప్పటివరకు హీరోలను చూసి ఉంటారు. విలన్స్ ను చూసి ఉంటారు. కానీ, ఈసారి వారిని మించి చూస్తారు. ఈసారి కనికరం లేకుండా ఫైర్ సెట్ చేయడానికి సిద్దమయ్యాడు' అంటూ రాసుకొచ్చారు. ఇక పోస్టర్ లో సిద్దు.. టైటిల్ కి యాప్ట్ గా బ్యాడాస్ లానే కనిపించాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో సిద్దు ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.