Siddhu Jonnalagadda: ‘ఓజీ’ హైప్.. టిల్లు ఏమన్నాడంటే..
ABN, Publish Date - Sep 20 , 2025 | 02:45 PM
పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఓజీ(OG) చిత్రానికి విపరీతంగా హైప్ పెరుగుతోంది. వరుస పోస్ట్‌లతో సినిమా క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. అభిమానులు ఈ చిత్రం కోసం ఎంతో ఎదురుచూస్తున్నారు.
పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఓజీ(OG) చిత్రానికి విపరీతంగా హైప్ పెరుగుతోంది. వరుస పోస్ట్‌లతో సినిమా క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. అభిమానులు ఈ చిత్రం కోసం ఎంతో ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ సినిమా ట్రెండింగ్‌లో ఉండేలా చేస్తున్నారు. ఇప్పుడు ఈ జాబితాలో హీరో సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) కూడా చేరారు. తాజాగా సిద్థూ ‘ఓజీ’ హైప్ గురించి తనదైన స్టైల్‌లో ట్వీట్ చేశాడు. ‘ఓజీ’ హైప్ ఎఫెక్ట్ మా హెల్త్‌పై పడేలా ఉంది. 25 వరకూ మేం ఉంటామో, పోతామో కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడే ఇలా ఉంటే 25వ తేది తర్వాత పరిస్థితి ఏంటో? మీరు పవన్ కాదు.. తుఫాను’ అంటూ పవన్‌ను ట్యాగ్ చేసి పోస్ట్ చేశారు సిద్ధూ.
ప్రస్తుతం అతని పోస్ట్‌ను అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో చిత్రబృందం ప్రమోషన్స్ జోరు పెంచింది. తాజాగా ఇందులో పవన్ పాడిన జపనీస్ పాటను విడుదల చేశారు మేకర్స్. ‘చిన్నప్పుడు నా గురువు చెప్పిన హైకూ చెప్తాను విను. వాషి యో వాషి’ అంటూ పవన్ చెప్పిన ఈ జపనీస్ హైకూ ఆకట్టుకుంది. సుజీత్ దర్శకత్వంలో గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకురానుంది. డి.వి.వి దానయ్య నిర్మాత. ప్రియాంక మోహన్ కథానాయికి. ఇమ్రాన్ హస్మీ విలన్‌గా కనిపిస్తారు. శ్రియారెడ్డి, అర్జున్ దాస్, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రధారులు. తమన్ స్వరకర్త.