Shruti Haasan: నిశ్శబ్దాన్ని ఆస్వాదించాలనుకుంటున్నాను..
ABN, Publish Date - Jul 08 , 2025 | 05:52 PM
విశ్వనాయకుడి కూతురు శ్రుతీహాసన్ (Shruti Haasan) అభిమానులకు షాక్ ఇచ్చారు.
విశ్వనాయకుడి కూతురు శ్రుతీహాసన్ (Shruti Haasan) అభిమానులకు షాక్ ఇచ్చారు. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన వ్యక్తిగత విషయాలతోపాటు సినిమాల విశేషాలు ఫ్యాన్స్‌తో పంచుకుంటుంటారు. తాజాగా ఆమె పెట్టిన పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. కొన్ని రోజులపాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు శ్రుతి హాసన్ తెలిపారు. సోమవారం ఇన్‌స్టాలో తన పాలోవర్స్‌ను ఉద్దేశించి ఆమె ఓ పోస్ట్ చేశారు. కొన్ని రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలనుకుంటున్నాననీ, నిశ్శబ్దాన్ని ఆస్వాదించాలనుకుంటున్నాని చెప్పారు.
దీంతో అభిమానులు కాస్త షాక్ అయ్యారు. ఎందుకు ఇలాంటినిర్ణయం అని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం శ్రుతి హాసన్ రజనీకాంత్ ‘కూలీ’లో నటిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. నాగార్జున, ఉపేంద్ర, ఆమిర్ ఖాన్, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రధారులు. అన్నీ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.