సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Shruti Haasan: ఆ ఫెయిల్యూర్స్‌ నా వల్ల జరగలేదు.. కానీ నింద నాపైనే..

ABN, Publish Date - Jul 26 , 2025 | 11:31 AM

ఒక్క సినిమా చేస్తే చాలనుకుని వచ్చి హీరోయిన్‌గా స్థిరపడిపోయానని చెబుతున్నారు విశ్వనాయకుడు కమల్‌హాసన్‌ ముద్దుల కూతురు శ్రుతీహాసన్‌. ఆమె మల్టీటాలెంటెడ్‌ పర్సన్‌ అన్న సంగతి తెలిసిందే.

Shruti Haasan

‘సినిమా సక్సెస్‌ అనేది ఒక్కరితో వచ్చేది కాదు. ఫెయిల్యుర్‌ కూడా అంతే! సినిమా అంటే హీరోహీరోయిన్‌ మాత్రమే కాదు. కథ నుంచి ఆర్టిస్ట్‌ల వరకూ వెనక చాలా మందే ఉంటారు. సినిమా హిట్‌ అయితే క్రెడిట్‌ హీరోకి ఇస్తారు.. ఫెయిల్యూర్‌ను మాత్రం హీరోయిన్‌పై రుద్దేస్తారు. పైగా ఐరెన్‌ లెగ్‌ అనే టాం్యగ్‌లు కూడా ఇస్తారు. ఇదే మాట హీరోలను ఎందుకు అనలేకపోతున్నారు’ అంటూ తన కెరీర్‌ బిగినింగ్‌ డేస్‌ను గుర్తు చేసుకున్నారు శుతీహాసన్‌. ఒక్క సినిమా చేస్తే చాలనుకుని వచ్చి హీరోయిన్‌గా స్థిరపడిపోయానని చెబుతున్నారు శ్రుతీహాసన్‌(Shruti Haasan). ఆమె మల్టీటాలెంటెడ్‌ పర్సన్‌ అన్న సంగతి తెలిసిందే. నటిగానే కాకుండా, గాయనిగా, సంగీత దర్శకురాలిగా నిరూపించుకున్నారు. అంతే కాదు.. ఆమెకు రచన, దర్శకత్వం పైన కూడా మక్కువ ఉంది. ఇప్పటికే పలు పాటలు, కవితలు రాశారు. ఇక దర్శకత్వం ఒకటే మిగిలి ఉంది. సినిమా విషయానికొస్తే త్వరలో 'కూలీ' (Coolie) సినిమాతో ప్రేక్షకులను పలకరించనుంది శ్రుతీ. ఇప్పుడామె అగ్ర కథానాయిక. కానీ ఒకప్పుడు ఐరెన్‌ లెగ్‌ అనే ట్యాగ్‌తో పిలవబడిన నటి. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కెరీర్‌ బిగినింగ్‌ డేస్‌ గురించి చెప్పుకొచ్చారు.  (Iron leg Shruti Haasan)


 
‘నేను కమల్‌హాసన్‌ కూతురు అనే బ్యాగ్రౌండ్‌తో వచ్చినా.. స్వతహానే ఎదిగాను. నాన్న స్టార్‌డమ్‌ నేను ఇండస్ట్రీలోకి రావడం వరకే ఉపయోగించుకున్నా. ఆ తర్వాత నా దారి నేనే వెతుకున్నా. ప్రతి ఒక్కరిలో ఓ టాలెంట్‌ ఉంటుంది. ఎవరి ప్రత్యేకతలు వారివి. పోలికలు ఉండకూడదు. నేను ఒక్క సినిమాలో నటిస్తే చాలనుకుని వచ్చా. ఇప్పుడు ఇండస్ట్రీలోకి వచ్చి 15 ఏళ్లు, 40కి పైగా చిత్రాలు పూర్తి చేశా. నటిని కావాలనే ఆలోచన నాకు ఎప్పుడూ లేదు. దర్శకత్వం, రచన అంటే ఇష్టం. నా కథలను నేనే ఎంపిక చేసుకునేదాన్ని. సంతకం చేసిన తర్వాత నాన్నతో చెప్పేదాన్ని. నా పేరెంట్స్‌ ఎప్పుడూ నా నిర్ణయాలను తప్పుపట్టలేదు’ శ్రుతీహాసన్‌ చెప్పారు.  (Golden leg Shruti Haasan)



‘గబ్బర్‌ సింగ్‌’ కంటే ముందు తెలుగులో నటించిన రెండు చిత్రాలు ‘అనగనగా ఓ ధీరుడు’, ‘ఓ మై ఫ్రెండ్‌’ ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకున్నాయి. అది నా వల్ల జరిగిన నష్టం కాదు. నాకు చెప్పిన కథతో నటించుకుంటూ వెళ్లాను. ఆ సినిమా ఫ్లాప్‌ కావడంతో నాపై ఐరన్‌ లెగ్‌ అనే ముద్ర వేశారు. ఒక సినిమా సక్సెస్‌, ఫెయిల్యూర్‌ ఏ ఒక్కరి చేతిలో ఉండదు. హిట్‌ అయితే హీరో వల్ల అని, ఫెయిల్‌ అయితే మీరోయిన్‌ వల్లే అని కామెంట్స్‌ చేస్తారు. ఆ తర్వాత పవన్‌ కల్యాన్‌తో  ‘గబ్బర్‌ సింగ్‌’ చేశా. అది ఎంత  పెద్ద హిట్టో తెలిసిందే. అప్పుడు ఐరన్‌ లెగ్‌  శ్రుతీ కాస్త గోల్డెన్‌ లెగ్‌ అయిపోయింది. అలా రెండు రకాల మాటలు ఎలా మాట్లాడతారో ఇప్పటికీ నాకు అర్థం కాదు. కామెంట్‌ చేసే వల్ల ఆలోచన తీరు ఇలాగే ఉంటుందనుకున్నా. దయచేసి నా కాళ్లను నాకు వదిలేయండి. విమర్శలు, ప్రశంసలు నాకొద్దు. అప్పట్లో నేను నటించిన ‘త్రీ’ సినిమా సక్సెస్‌ కాలేదు. నేనెంతో కష్టపడి చేసిన సినిమా హిట్‌ అవ్వనందుకు చాలా బాధపడ్డా. అదే సినిమా ఇప్పుడు వస్తే బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అవుతుంది. ‘వై దిస్‌ కొలవెరి’ పాట కంటే కూడా సినిమానే పెద్ద హిట్‌ అవుతుంది’ అన్నారు శ్రుతీ. 

Updated Date - Jul 26 , 2025 | 11:48 AM