Rahul Sipligunj: హరిణ్యా రెడ్డితో.. రాహుల్ సిప్లిగంజ్ నిశ్చితార్థం! షాక్‌లో ఫ్యాన్స్
ABN, Publish Date - Aug 18 , 2025 | 12:23 PM
బిగ్ బాస్ తెలుగు విన్నర్, ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ త్వరలో వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతున్నాడు.
ఆస్కార్ అవార్డు గ్రహీత, బిగ్ బాస్ తెలుగు విన్నర్, ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj) త్వరలో వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతున్నాడు. హైదరాబాద్‌కు చెందిన హరిణ్యా రెడ్డి (HarinyaReddy) తో ఆయన నిశ్చితార్థం ఆదివారం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో సాదాసీదాగాగా జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, రాహుల్ మాత్రం తన అధికారిక సోషల్ అకౌంట్లలో ఎలాంటి ఫోటోలు షేర్ చేయలేదు.
నిశ్చితార్థ వేడుకలో రాహుల్ పాస్టెల్ లావెండర్ షేర్వానీ ధరించగా, హరిణ్య రెడ్డి నారింజ రంగు లెహంగా అందరినీ ఆకట్టుకుంది. ఈ జంట ఫోటోలు చూసిన అభిమానులు, నెటిజన్లు “మేడ్ ఫర్ ఈచ్ అదర్”, “సూపర్ జంట” అంటూ కామెంట్లు చేస్తున్నారు. వీరి పెళ్లి తేది ఎప్పుడనేది తెలియాల్సి ఉంది. అయితే పెళ్లి విషయంలో గత ఐదారేండ్లుగా ఊరిస్తూ వచ్చిన రాహుల్ (Rahul Sipligunj) సడన్‌గా ఇలా ఎంగేజ్ మెంట్ చేసుకుని కనిపించడంతో చాలామంది షాక్ అవుతున్నారు.