Shivaji: సాంప్రదాయిని.. సుప్పిని.. సుద్దపూసని.. శివాజీ భలే టైటిల్ పట్టాడుగా
ABN, Publish Date - Oct 20 , 2025 | 10:01 AM
ఆ మధ్య కోర్టు సినిమాతో తన నట విశ్వరూపం చూపించిన శివాజీ ఇప్పుడు మరో డిఫరెంట్ కథతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు.
90s వెబ్ సిరీసతో రీ ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్‌లో దూసుకుపోతున్నాడు హీరో శివాజీ (Sivaji). ఆ మధ్య కోర్టు సినిమాతో తన నట విశ్వరూపం చూపించిన ఆయన ఇప్పుడు మరో డిఫరెంట్ కథతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. ఈ సారి ఆయనే స్వయంగా నిర్మాత మారి తన శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ పతాకంపై రెండవ చిత్రంగా ఓ చిత్రం స్టార్ట్ చేశాడు. లయ (Laya) శివాజీకి జంటగా నటిస్తోండగా ప్రిన్స్, అలీ, ధన్‌రాజ్, ఇమ్మాన్యూయేల్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. సుధీర్ శ్రీరామ్ ఈ సినమాకు దర్శకత్వం వహించగా రంజిన్ రాజ్ సంగీతం అందిస్తున్నాడు.
అయితే దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం రాత్రి మేకర్స్ సాంప్రదాయమైన పార్టీ పబ్ (Sampradayamaina Party Pub lo) లో అంటూ ఓ ప్రత్యేక ఈవెంట్ నిర్వహించి ఈ సినిమా టైటిల్ రివీల్ చేయడం విశేషం. ఈ ఈవెంట్‌కు అలీ, రఘుబాబు,లయ, శివాజీ, ధన్‌రాజ్, చిత్రం శీను, రాఘవ, పొట్టి నవీన్ ఇలా అనేక మంది హజరై టైటిల్ ఎనౌన్స్ మెంట్ ఫన్ కార్యక్రమంలో నవ్వులు పూయించారు. చివరకు 90s దర్శకుడు ఆదిత్య హాసన్ ఈ సినిమా టైటిల్ సాంప్రదాయిని.. సుప్పిని.. సుద్దపూసని (sampradayini suppini sudda pusani) అంటూ ప్రకటించారు. ప్రస్తుతం ఈ వాడియో బాగా వైరల్ అవుతుంది.