సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Dhandoraa: శివాజీ, న‌వ‌దీప్‌, నందు, బిందు మాధవి.. 'దండోరా' టీజ‌ర్ అదిరింది

ABN, Publish Date - Nov 17 , 2025 | 11:30 AM

నాలుగు పుస్తకాలు చదివి లోకమంతా తెలిసినోడి లెక్క మాట్లాడకు... నీకు తెలియని లోకం ఇంకోటి ఉంది

Dhandoraa

విల‌క్ష‌ణ న‌టులు శివాజీ (Shivaji), న‌వ‌దీప్‌(Navdeep), నందు(Nandu), బిందు మాధవి (Bindu Madhavi) కాంబోలో తెర‌కెక్కిన చిత్రం 'దండోరా' (Dhandoraa). రవి కృష్ణ, మణిక, అనూష, రాధ్య‌ ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటించారు. అన్నికార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ 25న థియేట‌ర్ల‌కు వ‌చ్చేందుకు రెడీ అయింది.

ఈ నేప‌థ్యంలో మేక‌ర్స్ తాజాగా సోమ‌వారం ఉద‌యం ఈ చిత్రం టీజ‌ర్ రిలీజ్ చేశారు. టీజ‌ర్ చూస్తుంటే ఫ‌క్తు తెలంగాణ మాండ‌లికంలో వ్యంగ్యంగా తెర‌కెక్కించిన చిత్రంగా తెలుస్తోండ‌గా, ముఖ్యంగా నాలుగు పుస్తకాలు చదివి లోకమంతా తెలిసినోడి లెక్క మాట్లాడకు... నీకు తెలియని లోకం ఇంకోటి ఉంది అంటూ సాగే డైలాగులు, స‌న్నివేశాలు ఆక‌ట్టుకునేలా ఉన్నాయి. మీరూ ఓ లుక్కేయండి.

గ‌తంలో నేష‌న‌ల్ అవార్డ్ ద‌క్కించుకున్న చిత్రం ‘క‌ల‌ర్ ఫోటో’,ఆపై న‌వ్వులు పూయించిన‌ ‘బెదురులంక 2012’ చిత్రాల‌ను నిర్మించిన‌  లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై నిర్మాత ర‌వీంద్ర బెన‌ర్జీ ముప్పానేని (Benerji) ఈ 'దండోరా' (Dhandoraa) చిత్రాన్ని నిర్మించారు. మురళీ కాంత్ దర్శకత్వం వ‌హించాడు. మార్క్ కె. రాబిన్ సంగీతం అందించాడు.

Updated Date - Nov 17 , 2025 | 11:50 AM