Chai Wala: తండ్రీ,కొడుకుల సెంటిమెంట్‌తో.. చాయ్ వాలా! టీజర్ బావుంది
ABN, Publish Date - Aug 21 , 2025 | 01:16 PM
చూసి చూడంగానే, గమనం, భూతద్దం భాస్కర్ నారాయణ వంటి సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరైన నటుడు శివ కందుకూరి.
చూసి చూడంగానే, గమనం, భూతద్దం భాస్కర్ నారాయణ వంటి సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరైన నటుడు శివ కందుకూరి (Shiva Kandukuri). ఆయన హీరోగా నటించిన నూతన చిత్రం చాయ్ వాలా (Chai Waala). హర్షిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాధా విజయలక్ష్మీ, వెంకట్ ఆర్. పాపుడిప్పు ఈ మూవీని నిర్మిస్తుండగా, ప్రమోద్ హర్ష (Pramod Harsha) రచన, దర్శకత్వం చేశాడు. తేజు అశ్విని (Teju Ashwini) కథానాయిక కాగా రాజీవ్ కనకాల (Rajeev Kanakala), రాజ్ కుమార్ కసిరెడ్డి, చైతన్య కీష్ణ, వడ్లమాని శ్రీనావాస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
తాజాగా.. మేకర్స్ విడుదల చేసిన చిత్రం టీజర్ ఆకట్టుకునేలా, ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యేలా ఉంది. టీజర్ చూస్తే హైదరాబాద్ బ్యాక్ డ్రాప్‌లో ఉంటుందని తెలుస్తుండగా టీ షాప్ నడిపే ఓ మధ్యతరగతి వ్యక్తిగా రాజీవ్ కనకాల అతని కుమారుడిగా శివ నటించారు. చాయ్ వాలా అంటూ చుట్టూ అవమానించే ప్రజల మధ్య తండ్రీకొడుకుల సంఘర్షణ, తండ్రి కష్టం చూసి కుమారుడు ఏం చేశాడనే కథతో హృద్యంగా తెరకెక్కించినట్లు అర్థమవుతోంది.