సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Naari Naari Naduma Murari: శర్వానంద్‌.. నిల‌బ‌డ‌తాడా.. సైడ్ అవుతాడా

ABN, Publish Date - Oct 22 , 2025 | 07:04 AM

వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలయ్యే చిత్రాల లిస్ట్‌లోకి శర్వానంద్ సినిమా చేరింది.

Naari Naari Naduma Murari

వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలయ్యే చిత్రాల లిస్ట్‌లోకి మరో సినిమా చేరింది. శర్వానంద్ (Sharwanand) హీరోగా నటిస్తున్న ‘నారీ నారీ నడుమ మురారి’ (Naari Naari Naduma Murari) చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు నిర్మాతలు అనిల్‌ సుంకర, రామబ్రహ్మం సుంకర వెల్లడించారు. ‘సామజవరగమన’ (Samajavaragama)ఫేమ్ దర్శకుడు రామ్‌ అబ్బరాజు ఈ చిత్రానికి దర్శకుడు. సంయుక్త (Samyuktha), సాక్షి వైద్య ( Sakshi Vaidya.), కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు తుది దశకు చేరుకున్నాయి.

దీపావళి సందర్బంగా సాంప్రదాయ పంచెకట్టులో ఉన్న శర్వానంద్‌ లుక్‌ పోస్టర్‌ను విడుదల చేసి విడుదల విషయాన్ని ప్రకటించారు నిర్మాతలు అయితే ఇదే సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి శంక‌ర వ‌ర ప్రాసాద్‌, ప్ర‌భాస్ రాజాసాబ్‌, న‌వీన్ పొలిశెట్టి అన‌గ‌న‌గా ఓ రాజు, విజ‌య్‌, జ‌న నాయ‌కుడు వంటి భారీ చిత్రాల‌ను రిలీజ్ చేస్తున్న‌ట్లు ఇప్ప‌టికే ఆయా నిర్మాణ సంస్థ‌లు ప్ర‌క‌టించాయి కూడా. దీంతో ఇప్పుడు ఈ సినిమా కూడా ఈ జాబితాలో చేర‌డంతో పోటీ మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా మారింది.

అయితే గ‌తంలో శ‌ర్వానంద్ న‌టించిన ఎక్స్‌ప్రెస్ రాజా (Express Raja), శ‌త‌మానం భ‌వ‌తి ( Sathamanam Bhavati) రెండు సినిమాలు గ‌తంలో సంక్రాంతి బ‌రిలో భారీ చిత్రాల న‌డుమ రిలీజ్ అయి మంచి విజ‌యం సాధించిన రికార్డు ఉండ‌డం విశేషం. మ‌రి త‌న‌కు క‌లిసి వ‌చ్చిన సెంటిమెంట్‌ను కంటిన్యూ చేస్తూ త‌న సినిమాను పోటీలో ఉంచుతాడా లేదా తీరా రిలీజ్ స‌మ‌యానికి ఎవ‌రు త‌గ్గుతారో తెలియాల్సి ఉంది.

ఇదిలాఉంటే రెండేండ్ల క్రితం శ‌ర్వానంద్ హీరోగా ప్రారంభ‌మైన 36వ చిత్రానికి ‘బైకర్‌’ అనే పేరు నిర్ణయించారు. 1990- 2000 సంవత్సరాల బ్యాక్‌డ్రాప్‌లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి అభిలాష్‌ రెడ్డి దర్శకుడు. వంశీ, ప్రమోద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం టైటిల్‌ను, ఫస్ట్‌ లుక్‌ను దీపావళి సందర్భంగా విడుదల చేశారు. మాళవిక నాయర్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం పూర్తి కావచ్చింది.

Updated Date - Oct 22 , 2025 | 07:04 AM