సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

M Venkaiah Naidu: శర్వానంద్‌ కొత్త జర్నీ షురూ..  వెంకయ్య నాయుడుచే లోగో లాంచ్ 

ABN, Publish Date - Sep 09 , 2025 | 10:39 PM

హీరో శర్వానంద్‌ (Sharwanand) కొత్త జర్నీ ప్రారంభించారు. OMI  పేరుతో నిర్మాణ సంస్థను నెలకొల్పారు. ఇతర నిర్మాణ సంస్థలా కాకుండా,  ఓమీ మల్టీ డైమెన్షన్‌ ప్లాట్‌ఫామ్‌గా రూపుదిద్దుకుంటోంది.


హీరో శర్వానంద్‌ (Sharwanand) కొత్త జర్నీ ప్రారంభించారు. OMI  పేరుతో నిర్మాణ సంస్థను నెలకొల్పారు. ఇతర నిర్మాణ సంస్థలా కాకుండా,  ఓమీ మల్టీ డైమెన్షన్‌ ప్లాట్‌ఫామ్‌గా రూపుదిద్దుకుంటోంది. సినిమా, వెల్‌నెస్‌ ప్రొడక్ట్స్‌, హాస్పిటాలిటీ రంగాలలో సేవలు అందించనున్నారు. ఈ సంస్థ లోగోను మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు మంగళవారం ఆవిష్కరించారు. శర్వానంద్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఓమ్‌(ఓంకారం), ఐ (నేను)లను కలిపి పెట్టిన పేరు ఆసక్తిగా ఉందన్నారు. ‘OMI .. నా విజన్‌. నా బాధ్యత. ఇది ఓ కంపెనీ మాత్రమే కాదు అంతకుమించి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆర్టిస్టులు, క్రియేటర్లకు ఇది మంచి వేదిక అవుతుందని ఆశిస్తున్నా. కొత్త కథలకు చెప్పేందుకు ప్రయత్నిస్తాం’ అని శర్వానంద్‌ పేర్కొన్నారు. 

'ఈ జర్నీని ఒంటరిగా మొదలుపెడుతున్నా, కానీ సత్యం, స్పష్టత, నిజాయితీతో ముందుకు సాగుతున్నాను. గొప్ప, సంకల్పం, బాధ్యతతో అడుగులు వేస్తున్నాను’ అని అన్నారు. ప్రస్తుతం శర్వానంద్‌ ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. వచ్చే ఏడాది జనవరిలో విడుదల చేసేందుకు సన్నాహాలు  చేస్తున్నారు. శర్వా హీరోగా బైక్‌ రేసింగ్‌ ఇతివృత్తంతో మరో సినిమా తెరకెక్కుతోంది.  ఇది కాకుండా భోగి అనే మరో చిత్రాన్ని ప్రకటించారు.


 
 

Updated Date - Sep 09 , 2025 | 10:39 PM