Adi Saikumar: షూటింగ్‌లో ప్రమాదం.. ఆది డెడికేషన్
ABN, Publish Date - Dec 19 , 2025 | 09:20 AM
ఆది సాయికుమార్ కథానాయకుడిగా నటించిన చిత్రం 'శంబాల షూటింగ్ సమయంలో జరిగిన ఒక విషయాన్ని చిత్ర యూనిట్ తాజాగా వెల్లడించింది.
ఆది సాయికుమార్(Adi Saikumar) కథానాయకుడిగా, అర్చనా అయ్యర్ (Archana Iyer) హీరోయిన్ గా నటించిన చిత్రం 'శంబాల'(Shambala). యుగంధర్ ముని (Yugandhar Muni) దర్శకత్వంలో రాజశేఖర్ అన్నభీమోజు (Rajasekhar Annabheemoju), మహీధర్ రెడ్డి (Mahidhar Reddy) సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. శ్రీ చరణ్ పాకాల ఈ చిత్రానికి సంగీతం అందించారు. అయితే, ఈ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక ఆసక్తికరమైన, కలవరపెట్టే విషయాన్ని చిత్ర యూనిట్ తాజాగా వెల్లడించింది.
'శంబాల' సినిమాను విజువల్ వండర్ గా తీర్చిదిద్దే క్రమంలో చిత్ర యూనిట్ భారీ యాక్షన్ సీక్వెన్స్ లను ప్లాన్ చేసింది. ఒక కీలకమైన రాత్రి షూటింగ్ లో వందలాది మంది నటీనటుల మధ్య భారీ ఫైట్ సీన్ చిత్రీకరిస్తుండగా హీరో ఆది సాయికుమార్ కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే చిత్ర యూనిట్ ఆందోళన చెందినప్పటికీ, ఆది మాత్రం వెనక్కి తగ్గలేదు. షూటింగ్ కు అంతరాయం కలగకూడదనే ఉద్దేశంతో నొప్పిని భరిస్తూనే ఆ రాత్రంతా షూటింగ్ లో పాల్గొన్నారట. సినిమా పట్ల ఆయన చూపిన ఈ నిబద్ధతను చూసి చిత్ర బృందం ప్రశంసల వర్షం కురిపిస్తోంది.
థియేటర్స్‌కి ఆడియన్స్‌ను రప్పించడం చాలా కష్టమని అందుకోసం కొందరు హీరోలు ఇలా శాయాశక్తుల కష్టపడుతుంటారని మేకర్స్ అభిప్రాయ పడ్డారు. అయితే.. 'శంబాల'పై ట్రేడ్ వర్గాల్లో మంచి అంచనాలు ఉన్నాయి. విభిన్నమైన కంటెంట్ తో వస్తున్న ఈ సినిమా బిజినెస్ ఇప్పటికే క్లోబ్ అయినట్లు సమాచారం. ఈ చిత్ర డిజిటల్, శాటిలైట్ హక్కులు మంచి ధరలకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. అటు నైజాం ఏరియాలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి, అలానే ఆంధ్ర మరియు సీడెడ్ ప్రాంతాల్లో ఉషా పిక్చర్స్ వంటి అగ్ర సంస్థలు ఈ మూవీని విడుదల చేస్తున్నాయి. ప్రస్తుతం నిర్మాతలు విడుదలకు ముందే లాభాల్లో ఉండటం విశేషం. మిస్టిక్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.