Buchi Babu: నక్క తోక తొక్కిన.. బుచ్చిబాబు! పెద్ద.. స్కెచ్చే ఇది
ABN, Publish Date - Nov 13 , 2025 | 07:18 PM
దక్షిణాదిలో తెలుగు సినిమా స్థాయి పెరిగింది. ఇప్పుడు బాలీవుడ్ (Bollywood) సైతం దక్షిణాది దర్శకులపై కన్నేశారు. షారుక్‌ఖాన్ (Shah Rukh Khan) అట్లీతో ‘జవాన్’ (jawan) మూవీ తీసి సూపర్‌హిట్ అందుకున్నారు.
దక్షిణాదిలో తెలుగు సినిమా స్థాయి పెరిగింది. ఇప్పుడు బాలీవుడ్ (Bollywood) సైతం దక్షిణాది దర్శకులపై కన్నేశారు. షారుక్‌ఖాన్ (Shah Rukh Khan) అట్లీతో ‘జవాన్’ (jawan) మూవీ తీసి సూపర్‌హిట్ అందుకున్నారు. ఇప్పుడు మరోసారి సౌత్ దర్శకులపై ఫోకస్ పెట్టినట్లు తెలిసింది. తాజా సమాచారం ప్రకారం ఆయన లుక్ సానా బుచ్చిబాబు (Sana buchibabu) మీద పడిందని ముంబై వర్గాల టాక్.
ప్రస్తుతం ఆయన రామ్ చరణ్ తో ‘పెద్ది’ సినిమా తీస్తున్నాడు. తదుపరి షారుక్‌తో ఓ భారీ చిత్రం సెట్ చేయబోతున్నాడని తెలిసింది. ఈ ప్రాజెక్ట్ కూడా మైత్రీ సంస్థ లోనే ఉండే అవకాశం ఉంది. మైత్రీ మూవీస్ షారుఖ్‌తో ఓ సినిమా చేయా?ని ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు. సుకుమార్ సపోర్ట్ తోనే.. ఈ కథ షారుక్ చెంతకు వెళ్లిందని ఆయన కూడా ఈ సినిమాపై ఆసక్తి చూపిస్తున్నారని సన్నిహిత వర్గాల నుంచి సమాచారం.
‘పెద్ది’ అంచనాలు మించేలా ఉంటే బుచ్చితో సినిమాకి షారుక్ సై అనే అవకాశం ఉంది. ఈ సినిమా హిట్‌తో తన కెరీర్ గ్రాఫ్ మారిపోతుందని బుచ్చికి కూడా ఓ ఐడియా ఉంది. అందుకే తనని తాను నిరూపించుకోవడానికి ఈ సినిమాపై బుచ్చిబాబు బాగా దృష్టి పెట్టారు. ఈ చిత్రం నుంచి ఇప్పటి దాకా వచ్చిన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు భారీగా పెంచాయి. తాజాగా వచ్చిన ‘చికిరి’ సాంగ్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. డిసెంబరులో ఈ సినిమా నుంచి మరో పాట రాబోతుంది. చరణ్, జాన్వీకపూర్‌లపై చిత్రీకరిస్తున్న ఈ డ్యూయెట్ ను రెహమాన్ డ్యూయెట్ వేరే లెవల్లో ఉంటుందట.