Jayabheri Productions: అతడు సీక్వెల్‌కు సిద్ధం

ABN , Publish Date - Jul 27 , 2025 | 02:47 AM

‘‘జయభేరి’ బేనర్‌లో మేం తీసిన చిత్రాలు మొత్తం ఒకెత్తు..‘అతడు’ ఒక్కటీ ఒకెత్తు. అప్పట్లో అధునాతన సాంకేతికతతో ఈ మూవీని నిర్మించాం. అద్భుతమైన డైలాగ్స్‌తో త్రివిక్రమ్‌ అందరినీ మెప్పించారు. అందుకే...

‘‘జయభేరి’ బేనర్‌లో మేం తీసిన చిత్రాలు మొత్తం ఒకెత్తు..‘అతడు’ ఒక్కటీ ఒకెత్తు. అప్పట్లో అధునాతన సాంకేతికతతో ఈ మూవీని నిర్మించాం. అద్భుతమైన డైలాగ్స్‌తో త్రివిక్రమ్‌ అందరినీ మెప్పించారు. అందుకే త్రివిక్రమ్‌ మాటల మాంత్రికుడు అయ్యారు’ అని అన్నారు సీనియర్‌ నటుడు, నిర్మాత మురళీమోహన్‌. హీరో మహేశ్‌బాబు, దర్శకుడు త్రివ్రికమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో మురళీ మోహన్‌ నిర్మించిన ‘అతడు’ సినిమా 2005 ఆగస్టు 10న విడుదలై ఘన విజయం సాధించింది. ఈ చిత్రాన్ని ఆగస్టు 9న మహేశ్‌బాబు పుట్టిన రోజు సందర్భంగా రీ రిలీజ్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన రీ రిలీజ్‌ ప్రెస్‌మీట్‌లో మురళీ మోహన్‌ మాట్లాడుతూ ‘ఈ మూవీ కోసం మహేశ్‌ బాబు చాలా సహకరించారు. ఈ రీ రిలీజ్‌ ద్వారా వచ్చిన డబ్బులను మహేశ్‌బాబు ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తాం. మహేశ్‌బాబు, త్రివిక్రమ్‌ డేట్స్‌ ఇస్తే ‘అతడు’ సీక్వెల్‌ను మా బేనర్‌ నిర్మిస్తుంది’ అని అన్నారు. జయభేరి ప్రతినిధి ప్రియాంక దుగ్గిరాల మాట్లాడుతూ ‘ఈ సినిమాను ఇప్పుడున్న టెక్నాలజీతో 8కె, 4కెలోకి మార్చాం’ అని చెప్పారు.

Sunday Tv Movies: ఆదివారం, జూలై 27న.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

Deviyani Sharma: అందాలను ఈ రేంజ్ లో ఆరబోస్తున్నా పట్టించుకోరేంటయ్యా

Updated Date - Jul 27 , 2025 | 02:48 AM