NR Anuradha Devi: మళ్ళీ చిత్ర నిర్మాణంలోకి అనూరాధా దేవి
ABN, Publish Date - Oct 03 , 2025 | 05:22 PM
సీనియర్ నిర్మాత ఎన్.ఆర్. అనురాధా దేవి కొన్నేళ్ళ గ్యాప్ తర్వాత మరోసారి చిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టారు. అభిరామ్ హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ సినిమా దసరా రోజున ప్రారంభమైంది.
ప్రముఖ నటి, నిర్మాత, స్టూడియో అధినేత కృష్ణవేణి (Krishnaveni) మరణానంతరం ఆమె కుమార్తె, నిర్మాత ఎన్.ఆర్. అనురాధా దేవి (N.R. Anuradha Devi) తిరిగి సినిమా నిర్మాణం వైపు అడుగులు వేశారు. శ్రీసాయి శోభనాచల పిక్చర్స్ పతాకంపై అనూరాధా దేవి సమర్పణలో ఓ సినిమా ప్రారంభమైంది. విజయ దశమి రోజున ఫిల్మ్ నగర్ లోని సంస్థ కార్యాలయంలో నిరాడంబరంగా ఈ సినిమా ప్రారంభమైంది.
అభిరామ్ (Abhiram) హీరోగా నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ షాట్ ను దేవుడి పటాలపై తీశారు. సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ భగీరథ కెమెరా స్విచ్చాన్ ఆయన్ చేయగా, అభిరామ్ క్లాప్ కొట్టారు. సినిమా స్క్రిప్ట్ ను ఎన్.ఆర్. అనురాధాదేవి అందించారు. ఈ పూజా కార్యక్రమానికి ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు హాజరయ్యారు. దీపావళి తర్వాత రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభిస్తామని నిర్మాత, దర్శకుడు అభిరామ్ రెడ్డి దాసరి చెప్పారు. ఈ సినిమా లవ్, థ్రిల్లర్ గా రూపొందుతుందని, ఈ తరానికి నచ్చే కథ తో నిర్మిస్తున్నామని, త్వరలోనే మిగతా నటీనటులను ఎంపిక చేస్తామని ఆయన అన్నారు. 'మంత్ర' ఆనంద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు విజయ్ భాస్కర్ సద్దాల సినిమాటోగ్రాఫర్, కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అభిరామ్ రెడ్డి దాసరి.
Also Read: Akhanda -2: బాలకృష్ణపై పథకం ప్రకారం ట్రోలింగ్...
Also Read: Samantha: పండగ పూట.. శుభవార్త చెప్పిన సమంత