Mr. Karthik: మళ్లీ థియేటర్లకు వస్తోన్న.. మిస్టర్ కార్తీక్
ABN, Publish Date - Jul 20 , 2025 | 07:44 PM
ధనుష్, రీచా గంగోపాధ్యాయ జంటగా తెరకెక్కిన మిస్టర్ కార్తీక్ రీ రిలీజ్‌కు రెడీ అయింది.
గతంలో తెలుగులో ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, యుగానికొక్కడు, 7జజీ బృందావన్ కాలనీ సినిమాలతో యూత్‌లో తనకంటూ ప్రత్యేక క్రేజ్ ఏర్పర్చుకున్న క్రియేటివ్ డైరెక్టర్ సెల్వ రాఘవన్ (Selvaraghavan) దర్శకత్వంలో 2011లో ధనుష్ (Dhanush) హీరోగా, రీచా గంగోపాధ్యాయ (Richa Gangopadhyay) హీరోయిన్‌గా తమిళంలో తెరకెక్కిన సినిమా ‘మయక్కమ్ ఎన్న’ (Mayakkam Enna). ఈ చిత్రాన్ని 2016లో మిస్టర్ కార్తీక్ (Mr. Karthik) పేరుతో తెలుగులో రిలీజ్ చేయగా మంచి విజయం సాధించింది. ధనుష్ కెరీర్‌లో ఓ విభిన్న చిత్రంగా గుర్తింపు తెచ్చుకుంది.
కాగా జూలై 27న ధనుష్ బర్త్ డే సందర్భంగా ఇప్పుడు ఈ సినిమాను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. మిస్టర్ కార్తీక్ సినిమాను థియేటర్స్ లో రీ రిలీజ్ చేస్తున్నారు. ఓం శివగంగా ఎంటర్ప్రైజెస్ బ్యానర్ పై శ్రీమతి కాడబోయిన లతా మండేశ్వరి సమర్పణలో నిర్మాత కాడబోయిన బాబురావు ఈ సినిమాను తెలుగులోకి తీసుకు వస్తున్నారు.
అయితే.. ఈ చిత్రంలో హీరో హీరోయిన్ మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ముఖ్యంగా హీరో అనారోగ్యం పాలవడం, భార్య అతన్ని చూసుకునే విధానం హృదయాన్ని తాకేలా దర్శకుడు తెరకెక్కించారు. ఇటీవల తమిళంలో ఈ సినిమాను విడుదల చేయగా మంచి అదరనను దక్కిచుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు రెండు తెలు రాష్ట్రాలలోనూ ఈ మిస్టర్ కార్తీక్ (Mr. Karthik) చిత్రం అలరిస్తుందని నిర్మాతలు అశిస్తున్నారు.