సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Selvaraghavan: హీరోగా.. సెల్వరాఘవన్‌

ABN, Publish Date - Jul 06 , 2025 | 11:34 PM

క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, విలన్‌గా, స్క్రీన్‌ రైటర్‌గా రాణిస్తున్న దర్శకుడు సెల్వరాఘవన్ నటించే చిత్రం ఇటీవ‌ల‌ పూజతో ప్రారంభమైంది.

selva

క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, విలన్‌గా, స్క్రీన్‌ రైటర్‌గా రాణిస్తున్న దర్శకుడు సెల్వరాఘవన్ (Selvaraghavan) నటించే కొత్త చిత్రం ఇటీవ‌ల‌ పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. డెన్నిస్‌ మంజునాథ్ (Dennis Manjunath) దర్శకుడు.

విజయ్‌ సతీష్‌ సమర్పణలో ‘వ్యోమ్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌’ (Vyom Entertainments)పతాకంపై నిర్మించనున్నారు. ఇందులో ఖుషి రవి (Kushee Ravi), కౌసల్య, వైజీ మహేంద్రన్‌, మైమ్‌ గోపి, సతీష్‌ తదితరులు నటిస్తున్నారు. తొలి దశ షెడ్యూల్‌ సేలంలో ప్రారంభమైంది. ఈ మూవీ ఫస్ట్‌లుక్‌, టీజర్‌ను త్వరలోనే రిలీజ్‌ చేయనున్నారు.

Updated Date - Jul 06 , 2025 | 11:34 PM